తడిసిన వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలి.
- YSR తెలంగాణ పార్టీ డిమాండ్.

మల్కపెల్లి వరి కొనుగోలు కేంద్రంలో తడిసిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులతో ధర్నా నిర్వహిస్తున్న వైఎస్సార్ తెలంగాణ నాయకులు.
Scv News Kasipet :--
కాసిపేట మండలం మల్కపల్లి వరి కొనుగోలు కేంద్రంలో తడిసిన వారి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ చిలుక సంతోష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ అజీముద్దీన్ ఆధ్వర్యంలో ఐకెపి రైతు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను పరామర్శించారు. రైతుల తరపున ధర్నా నిర్వహించి మాట్లాడుతూ శుక్రవారం రోజున ధాన్యాన్ని కాంటాక చేసిన తర్వాత కూడా అధికారుల నిర్లక్ష్యం వలన అదే రోజున లారీలో లోడ్ చేయకుండా ఆ నిర్లక్ష్యం వలన అకాల వర్షం రైతన్నలు తీవ్రంగా నష్టం పోయారన్నారు.నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా మన్నారు.అలాగే క్వింటాలకు ఐదు కిలోలు ధాన్యాన్ని కొరత చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొరత లేకుండా ప్రభుత్వం కొనాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
తడిసిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి,
ఎలాంటి కోతలు లేకుండానే ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి,
కాంటాలు వేసిన 48గంటల్లో రైతులకు డబ్బులు జమ చేయాలనిడిమాండ్ చేశారు.
ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలి,
తరుగు పేరుతో మోసం చేస్తున్న దళారులను అరికట్టాలి,
కొనుగోలు సెంటర్ల వద్ద రైతులకు సదుపాయాలు కల్పించాలి,
టార్పాలీన్లు, గోనె సంచులు రైతులకు అందచేయాలని
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఓరం కవి రాజ్ , జిల్లా నాయకులు కాంతయ్య యువజన విభాగం నాయకులు అబీద్ తదితరులు పాల్గొన్నారు.