సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలతో నిరసన.
![]() |
| తాసిల్దార్ కు వినతిపత్రం ఇస్తున్న వీఆర్ఏ లు. |
Scv News Kasipet:-
గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని కాసిపేట తాసిల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పే స్కేల్ అమలు చేయాలని, అర్హత గల గ్రామ రెవెన్యూ సహాయకులకు పదోన్నతి కల్పించాలని , మరియు 55 సంవత్సరాలు నిండిన గ్రామ రెవెన్యూ సహాయకుల వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు వినతి పత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యచరణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కున్సొత్ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి నతారి రవి,దినేష్ స్వామి, రాజలింగు, సునీత,లక్ష్మి పాల్గొన్నారు.

