వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ డిమాండ్

వివో ఏ లకు ఆర్థిక సహాయం చేస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ.
Scv News Kasipet:--
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని వివో ఏ చేస్తున్న సమ్మెను విరమింప చేయాలని తెరాస ప్రభుత్వాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ డిమాండ్ చేశారు.
ఈరోజుమండల కేంద్రంలో నిరసన తెలుపుతున్న వివో ఏలకు వేముల కృష్ణ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్భం గా వేముల కృష్ణ మాట్లాడుతూ వీవోఏల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కనీస వేతనం కింద 26 వేల రూపాయలు ప్రకటించాలని,అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.ఇందులో భాగంగా వారికి 2000 రూపాయల ఆర్థిక సహాయం అందిచారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ధర్మారావు పేట ఎంపిటిసి పార్వతి మల్లేష్, సోమగుడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గొలేటి స్వామి, నాయకులు కొత్త రమేష్,మైధం రమేష్,వెంకటేష్, ప్రేమ్ కుమార్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.