మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలం మల్కైపల్లి వరి కొనుగోలు కేంద్రంలో రైతుల అవస్థలు.

 ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటను అమ్ముకోలేని దైన్య స్థితిలో రైతన్నలు.

- అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి తల్లడిల్లుతున్న రైతాంగం.

- మల్కపల్లి కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించిన ప్రారంభం కాని కొనుగోలు.

 మల్కపల్లి వరి కొనుకోలు కేంద్రంలో గత పది రోజులుగా రైతులు వరి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు.


 గురువారం కురిసిన అకాల వర్షానికి తడుస్తున్న ధాన్యం, కవర్లు కప్పేందుకు తిప్పలు పడుతున్న రైతులు 


Scv News Kasipet:--

 ఎండాకాలంలో ఎన్నో ఆశలతో రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోతుండడంతో రైతు కుటుంబాలు తల్లడిల్లి పోతున్నాయి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మలకపల్లి కొనుగోలు కేంద్రానికి స్థానిక రైతులు వరి పంటను తెచ్చి పది రోజులు గడుస్తున్నా పట్టించుకునే వారు లేరు.రైతు కుటుంబాలు కొనుగోలు కేంద్రంలో పంటను తెచ్చి గత పది రోజులుగా తేమ శాతం తగ్గేందుకు ఆరబెడుతున్నారు. రాత్రుల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే పడుకుంటూ పశువుల బారి నుండి కాపాడుకుంటున్నారు. బుధవారం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడవడంతో రైతన్నలు కంట నీరు పెట్టుకుంటున్నారు. తేమశాతం తగ్గి ఆరిన ధాన్యం వర్షానికి తడవడంతో మళ్లీ ఆరపెట్టే పరిస్థితి వచ్చింది. గత సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ధర్మారావుపేట్ సహకార సంఘం చైర్మన్, మండల ప్రజా ప్రతినిధులు మల్కపల్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.


ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను సంబంధిత సహకార సంఘాధి కారులను ఆదేశించారు. మూడు రోజులు గడుస్తున్నా ఎమ్మెల్యే ఆదేశాలు అమలు కావడం లేదు. రైతుల ధాన్యం వర్షం నుండి కాపాడు కునేందుకు టార్పాలిన్లు, ధాన్యం నింపే గో నే సంచులు ఇంతవరకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాసిపేట మండలంలో ఈ రబీ సీజన్లో ధర్మ రావు పేట మల్కపల్లి, దేవాపూర్, పెద్దనపల్లి పంచాయతీ పరిధిలో 700 ఎకరాలు వరి సాగు అయిందని వ్యవసాయ అధికారులు తెలి పారు. మల్కపల్లి రాళ్లవాగు ప్రాజెక్టు, ధర్మారావుపేటూర చెరువు కింద అత్యధికంగా 400 ఎకరాల వరి పంట సాగయింది. వరి పంట కోతలు ప్రారంభమై పది రోజులు గడుస్తుంది. కోతలు చివరి దశకు చేరుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి గిట్టుబాటు ధర 2060 ప్రకటించడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆశతో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు 1500 నుండి 1700 మాత్రమే వడ్లు కొనుగోలు చేస్తున్నారు. రైతుల కోసమే తమ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల చివరి గింజ కొంటానని చెప్పే కేసిఆర్ ప్రభుత్వం, అధికారులు వడ్లు నింపుకునే గోనె సంచులు, టార్ఫలిన్లు, హమాలీలను లారీలను సమకూర్చడంలో ఘోరంగా విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం నింపేందుకు 30 వేల గన్ని సంచులు అవసరం ఉండగా 5000 సంచులు మాత్రమే వచ్చాయి. వర్షాల బారి నుండి వరి పంటను కాపాడు కునేందుకు అవసరమైన టార్పోలిన్లు సరిపడ సరపర చేయలేదని, నామ మాత్రంగా కొన్ని సరఫరా చేసిన వాటికన్నీ రంద్రాలే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్, వరంగల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వారి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. మళ్లీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉందని మాకు అలాంటి పరిస్థితి రాకుండా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం కొనుగోలు చేసేలా చొరవ చూపాలని కాసిపేట మండల రైతాంగం వేడుకుంటుంది.

 వరి కొనుగోలు లేక అవస్థలు పడుతున్నాం.

 - బండారి శ్రీను రైతు 


రాళ్లవాగు ప్రాజెక్టు కింద ఎండాకాలంలో వరి మంచి దిగుబడి వచ్చిందని సంతోషించాం. కానీ ప్రభుత్వము వరి కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నాము. రైతుల అవస్థలను గుర్తించి వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాను.

 రైతులను ఆదుకునే వారు లేరు.

 - రైతు,మల్కపల్లి ఎంపీటీసీ మడావి భీమ్రావు.


రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించిన సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. వరికుప్పల మీద కప్పేందుకు కవర్లు గాని నింపేందుకు గోనె సంచులు కానీ సరఫరా చేయక సంచులు సరిగా సరఫరా చేయడం లేదు.

వరి ధాన్యం మంచిగా ఆరబెట్టిన కొనుగోలు చేసేవారు లేరు 

 ముత్యం సత్తయ్య రైతు

 తేమ తగ్గాలని గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలో మంచిగా ఆరబెట్టాం. నిన్న కురిసిన వర్షానికి మళ్లీ తడవడంతో తేమ తగ్గేందుకు మళ్లీ ఆరబెట్టాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులము తీవ్ర నష్టాల గురవుతున్న ము.


 ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలి.

 కుమార్ రైతు.


కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వారి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. లేకుంటే రైతులను తీవ్రంగా నష్టపోతాం. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  స్పందించి  అధికారులతో కొనుగోలు చేసేలా చూడాలి 

మల్కపల్లి కొనుగోలు కేంద్రంలో రైతాంగాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు.


మల్కపల్లి కొనుగోలు కేంద్రంలో బుధవారం అకాల వర్షాలకు తడిసిన వరి కుప్పలను ఈరోజు మండల బిజెపి ఇన్చార్జ్ అట్కాపూర్ రమేష్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు సందర్శించి రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలోని వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని భరోసా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు స్థానిక మండల ప్రజా ప్రతినిధులు సర్పంచులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని కోరారు.