తాగునీటికి మద్దిమాడ వాసుల అవస్థలు.

తాగునీరు రావడంలేద ని ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మద్దిమాడ గ్రామ మహిళలు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం మద్దిమడ పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు గత వారం రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోకి నల్ల నీళ్లు రాకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్ల నీళ్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇంటింటికి డబ్బులు వసూలు చేసి వాడుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే గ్రామ సర్పంచి చొరవ తీసుకొని గ్రామంలోనికి తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.