రాజ్యాంగ ప్రతులను ప్రజలకు పంచాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్.

రాజ్యాంగ ప్రతులు ప్రజలకు పంచాలని తాసిల్దార్ కు వినతిపత్రం ఇస్తున్న ధర్మ సమాజ పార్టీ నాయకులు.
Scv News Kasipet :--
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులు తెలియజేసేందుకు రాజ్యాంగ ప్రతులను ప్రజలకు పెంచాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా కాసిపేట మండల కేంద్రంలో
ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల ధర్మ సమాజ పార్టీ నాయకుడు గొడిసెల సురేందర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ప్రతి పౌరునికి ఉచితంగా అందించాలని, ప్రతి పౌరునికి రాజ్యాంగం మీద అవగాహన ఉన్నప్పుడే రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరుడు హక్కుగా భావించి ప్రభుత్వాల ద్వారా పొందగలుగుతాడని అన్నారు. రాజ్యాంగ హక్కులను సాధించి దేశ భవిష్యత్తుకు తోడ్పాటు అందించగలుగుతారని అలాంటి రాజ్యాంగ విలువలు గల రాజ్యాంగ పుస్తకాన్ని ప్రతి పౌరునికి అందించకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై మా ధర్మసమాజ్ పార్టీ దండయాత్ర కొనసాగిస్తుందని గొడిసెల సురేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాడు. ఈ కార్యక్రమంలో నాయకులు నందిపాటి రాజు. తాళ్ళపెళ్లి చంద్రశేఖర్. మేడి రాజు. ఆయిళ్ళ స్వామి.గడ్డం మురళి. హేమచంద్ర దుర్గం, గోడిసేల విజయ్ కుమార్, బానోత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.