కాసిపేట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 32వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవాలందించా రని,ఆధునిక భారత దేశం కోసం ఆయన శ్రమించారన్నారు.దేశ రాజకీయాలలో యువత పాత్ర ఎంతో కీలకమని అందుకుగాను 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించారని ఆయన సేవలు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించబడుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ఎంపిటిసి భీమ్రావ్,ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,ఎస్ సి సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి,నాయకులు కొత్త రమేష్,షకీర్,మహంకాళి,జాడి శివ,వెంకటేష్,చిలుకయ్య తదితరులు పాల్గొన్నారు.
