ప్రజావాణిలో తుడుం దెబ్బ మండల శాఖ వినతి పత్రం అందజేత.

ప్రజావాణిలో గిరిజనుల సమస్యలపై వినతి పత్రం అందజేస్తున్న తుడుం దెబ్బ మండల కార్యదర్శి మడావి వెంకటేశ్వర్లు కోశాధికారి పెందూరి ప్రభాకర్లు.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో కు మండల తుడుందెబ్బ నాయకులు వివిధ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
*ముత్యంపల్లి రేషన్ షాప్ BC -B ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కావున 1/70 act ప్రకారం ముత్యంపల్లి గిరిజన ప్రాంతం అయినందున S T వారితో బర్తిచేయాలి.
* మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ రేషన్ షాపులు మంజూరు చేస్తూ పాత నూతన గిరిజన ప్రాంతాలలో ST వారితో షాప్ లను బర్తి చేయాలి
* కాసిపేట మండలంలోని ఆదివాసీ గుడెలలో నూతన VTDA కమిటీలను నియమించాలి.
* సోనాపూర్ గట్రాపల్లి లో బస్సు సౌకర్యం కల్పించాలి.
వినతి పత్రం అందజేసిన వారిలో కాసిపేట మండల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి మడావి వెంకటేష్, కోశాధికారి పెందుర్ ప్రభాకర్ లు ఉన్నారు.