మరో పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న సర్పంచ్.
![]() |
| జంబోజు శ్రీనివాస్ కుమార్తె స్రవంతి వివాహానికి పుస్తె మట్టెలు పదివేల నగదు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్న పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ. |
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లాలో వివిధ మండలాలలోని గ్రామ పంచాయతీల పరిధిలో నిరుపేద కుటుంబాలలో జరిగే పెండ్లిలలో ఆడపిల్లలకు ఆర్థిక సహా యం అందిస్తూ కాసిపేట మండలం లోని పల్లం గూడ పంచాయతీ సర్పంచ్ విజయ- చందులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచినప్పటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మాట తప్పకుండా వివాహ సమయాల్లో ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం మండలంలో మంచి పేరు సంపాదిం చారు. ఆ క్రమంలోనే ఈరోజు పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ చందులు పంచాయితీలోని జాంబోజు శ్రీనివాస్, కీర్తి శేషులు సత్తవ్వ గార్ల కుమార్తె స్రవంతి వివాహానికి పదివేల నగదు తో పాటు పుస్తే,మట్టెలు కొత్తబట్టలు అందించి ఆదుకున్నారు.
ఈనెల మూడవ తేదీన అదే పంచా యతీ పరిధిలోని జాడి భువనయ్య, కొక్కుల సత్తయ్య కూతుర్ల వివాహానికి పుస్తె మట్టెలు కొత్త బట్టలతోపాటు నగదు రెండు పెళ్లిళ్ల కోసం 20,000 అంద జేశారు. మండలంలోని 22 పంచాయతీలలో నగదు,పెళ్లి సమయంలో నిరుపేద కుటుంబా లకు ఏ సర్పంచ్ కూడా చేయలేని రీతిలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలలో వెలుగు లు నింపుతున్న మానవతామూర్తి మనసున్న మహారాణి సర్పంచ్ దుస్స విజయ చందులని గ్రామస్తులు కొనియాడు తున్నారు.
తన పదవీ కాలంలో ఇప్పటివరకు తన గ్రామ పంచాయతీలో 16మంది కుటుంబాల కు లక్షా 60 వేల ఆర్థిక సహాయం తో పాటు మరో లక్ష రూపాయల విలువగల మట్టెలు, మంగళ సూత్రం, కొత్తబట్టలు వస్తువులను అందజేశారు.పంచాయి తీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేస్తూన్న పల్లంగూడెం సర్పంచ్ దుస్స విజయ చందులను మండల వాసులు అభినందిస్తున్నారు.
