మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పల్లం గూడెం పంచాయతీలో రెండు పేద కుటుంబాలకు పెళ్లికి సహాయం చేసిన సర్పంచ్.

 పేదింటి కుటుంబాల పెళ్లి కి సహాయం చేసిన పల్లగూడెం సర్పంచ్ దుస్స విజయ - చందు.

 - నిరుపేద కుటుంబాలకు  ఆర్థిక ఆర్థిక సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచు దంపతులు.


 పేదింటి ఆడపిల్లలకు సహాయం చేస్తున్న సర్పంచ్
 దంపతులు దుస్సవిజయ-చందులు.

ScvNews Kasipet:--

 కాసిపేట మండలంలోని పల్లం గూడ పంచాయతీ సర్పంచ్ విజయ- చందు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచినప్పటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వివాహ సమయాల్లో ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ చందులు.

 శుక్రవారం పంచాయితీలో నిరుపేదలు జాడి సుజాత భువనయ్య, కొక్కుల కాంతా సత్తయ్య  గార్ల కూతుర్ల  పెళ్లికి ఒక్కొక్కరికి పుస్తే,మట్టెలు కొత్తబట్టలు పది వేల రూపాయల నగదు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. రెండు పెళ్లిళ్ల కోసం 20,000 నగదు తో పాటు  పెళ్లి వస్తువులు అందజేశారు. మండలంలోని 22 పంచాయతీలలో  నగదు పెళ్లి సమయంలో నిరుపేద కుటుంబాలకు ఏ సర్పంచ్ కూడా  చేయలేని రీతిలో  పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలలో  వెలుగులు నింపుతున్న మానవతామూర్తి మనసున్న  మహారాణి సర్పంచ్  దుస్స విజయ చందులని గ్రామస్తులు కొనియాడు తున్నారు.

తన పదవీ కాలంలో  ఇప్పటివరకు తన గ్రామ పంచాయతీలో 15మంది  కుటుంబాలకు లక్షా 50 వేల ఆర్థిక సహాయం తో పాటు మరో లక్ష రూపాయల విలువగల మట్టెలు, మంగళ సూత్రం, కొత్తబట్టలు  వస్తువులను అందజేశారు. పంచాయితీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం  చేస్తూ మంచిర్యాల జిల్లా కే ఆదర్శంగా నిలుస్తున్నారు.