మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా 137 వ మేడే దినోత్సవం.

 భారతదేశంలో కార్మికుల హక్కులను సాధించి పెట్టింది బాబా సాహెబ్  అంబేద్కర్.

 - కొమ్ముల బాపు  సా చై వే ప్రధాన కార్యదర్శి



 ఎర్రజెండా నెగరవేస్తున్న పంచాయతీ సంఘ నాయకుడు నారాయణ. 


Scv News Kasipet:--

 భారతదేశంలో ఎనిమిది గంటల పని దినం, కనీస వేతన చట్టం జీవిత బీమా లాంటి ఎన్నో హక్కులను బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టాడని అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలని సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు అన్నారు. కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్మిక సంగం  ఆధ్వర్యంలో మేడే దినోత్సవం జరిగింది.


ఈ సందర్భంగా కొమ్ముల బాపు మాట్లాడుతూ చికాగో లో 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించి ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు ఊరేగింపు చేస్తే పోలీసులు కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారన్నారు. రక్తంలో కార్మికులు తమ చొక్కాలను తడిపి ఎగుర వేయడంతో ఎర్ర జెండా పుట్టుకొచ్చిందని గుర్తు చేశారు. చికాగో అమరవీరుల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినం వచ్చిందని అన్నారు. భారతదేశంలో మాత్రం బాబా సాహెబ్ అంబేద్కర్ కృషితోనే కార్మిక చట్టాలు ఎనిమిది గంటల పని దినం వచ్చాయని అన్నారు.


మండల కాంగ్రెస్ నాయకుడు మెరుగు శంకర్ మాట్లాడుతూ చికాగో అమర వీరుల త్యాగ ఫలితంగా ఎనిమిది గంటల పని దినం సాధించు కున్నప్పటికీ స్థానిక కర్మాగారంలో 12 గంటల పని చేయించుకోవడం శోచనీయమన్నారు. 8 గంటల పని కొనసాగించేందుకు, కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు అందరం ఏకం కావాలన్నారు.


తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కొడప అనంత రావు మాట్లాడుతూ చికాగో అమరవీరుల పోరాటం వల్ల 8 గంటల పని దినంతో పాటు ఎన్నో కార్మిక హక్కులు సాధించుకుందామని అన్నారు. భారతదేశంలో కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరా సేందుకు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తుం దని వీటిని కాపాడుకునేందుకు అందరం పోరాడాలని పిలుపు నిచ్చారు.


భారాస మండల అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులు ఎన్నో పోరాటాల వల్ల సంపాదించుకున్న హక్కులను కాలరాసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. పార్లమెంటులో వారి సంఖ్య బలాన్ని చూసుకొని  కార్మిక చట్టాలను మార్చాలని ప్రయత్నిస్తుందని దీని అందరూ ప్రతిఘటించాలని అన్నారు.

 


సిఐటియుసి జిల్లా నాయకుడు నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను మార్చితే భవిష్యత్తులో కనీస వేతనాలు కూడా రావని అన్నారు. కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు ప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు ఎర్రజెండాను పంచాయితీ కార్మిక సంఘం నాయకుడు నారాయణ ఎగరవేశారు. చికాగో అమరవీరుల గురించి కొమ్ముల బాపు పాట పాడారు.మేడే సందర్భంగా ఎర్ర జెండా ఎగురవేసే సందర్భంలో పంచాయతీ కార్మికులు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకొని పూలు సమర్పించడం విశేషం.కార్యక్రమంలో పంచాయతీ సిబ్బందితో పాటు స్థానిక వార్డు సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కాసిపేట మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో  ఘనంగా 137 వ  మేడే దినోత్సవం.

 దేవర్పూర్ మేజర్ పంచాయతీలో ఎర్రజెండాను ఎగరవేస్తున్న సిపిఐ మండల కార్యదర్శి సర్వేశం.

 కాసిపేట టు  గనిపై ఎర్రజెండాను ఎగురవేసిన ఏఐటియుసి కార్యకర్తలు.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ని వివిధ గ్రామాలు గనులలో ఈరోజు 137 వ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. సిపిఐ పార్టీ  మండల పార్టీ ప్రధాన కార్యదర్శి దాగం మల్లేష్  ఆధ్వర్యంలో సోమ గూడెం, కాసిపేట, కొండాపూర్ యాప,దేవాపూర్ గ్రామాలలో మేడే ఉత్సవాలను జరుపుకున్నారు. ఎర్రజెండాలను ఎగురవేశారు.సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాసిపేట గని 1,2 గనుల లో ఫిట్ కార్యదర్శులు మీనుగు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ లు  ఎర్రజెండాలను ఎగురవేశారు. దేవాపూర్ మేజర్ పంచాయతీ లో ని ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఫ్యాక్టరీ ముందు మండల సిపిఐ కార్యదర్శి సర్వేశం ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఎగురవేశారు. మే డే కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు జాడి పోశం, దాగం రాజలింగు, దాడి గట్టయ్య, దుర్గం పోశం, గోపే తిరుమల, పిండే సంగీత తదితరులు పాల్గొన్నారు.