మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అకాల వర్షానికి మళ్లీ తడిసిన కాసిపేట మండలం మల్కపల్లి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం.

 

 తడిసిన వరి ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టాలి అంటున్న అధికారులు ఆందోళనలో రైతాంగం.

 మల్కపల్లి వరి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న తహసిల్దార్ దిలీప్ కుమార్.

 అకాల వర్షానికి తడిసిన కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం.

 తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్న రైతు సాయికిరణ్.


Scv News Kasipet :--

 అకాల వర్షాలకు కాసిపేట మండలం మల్కపల్లి కొనుగోలు కేంద్రంలో  ఈరోజు మధ్యాహ్నం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం కుప్పలతో పాటు సంచుల్లో నింపిన ధాన్యం కూడా తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తాసిల్దార్ దిలీప్ కుమార్ తేమ తగ్గేవరకు మళ్లీ ఆరబెట్టాలనడం, సంచుల్లో నింపిన వరి ధాన్యాన్ని వేరే సంచుల్లోకి మార్చాలని రైతులను కోరడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. సంచుల్లో నింపిన వరి ధాన్యాన్ని సకాలంలో లారీల ద్వారా తరలించక అధికారులు నిర్లక్ష్యం వహించారని, వారి నిర్లక్ష్యానికి తమనెలా బాద్యులు చేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఎండాకాలంలో మండలంలోని వివిధ గ్రామాల్లో రైతాంగం పండించిన వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో గిట్టుబాటు ధర వస్తుందని ఆశతో తరలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు  తెచ్చిన రైతులకు నిరాశ నిస్సృహలే మిగిలాయి. వరి కోతలు మొదలవు తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా కొనుగోలు కేంద్రాల ప్రారంభము,గన్ని సంచుల ఏర్పాటు, టార్పాలిన్ల సరఫరా చేయక తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగా నిర్లక్ష్యం వల్ల ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం అకాల వర్షాలకు తడిసి తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాసిపేట  మండలంలోని రైతాంగం పండించిన వరి పంటను కొనుగోలు చేసేందుకు మల్క పెళ్లిలో సహకార సంఘం  ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం ఏర్పాటులో తీవ్ర జాప్యంతో పాటు టార్ పలిన్లు గోనె సంచులు లేక వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం జరిగింది. రైతులు కోసిన వరి ధాన్యాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రంలో గత పది రోజులుగా కుప్పలుగా పోశారు.

ఈ నెల 15వ తేదీన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభం చేసి మూడు రోజులు అయినా కొనుగోలు ప్రారంభం కాలేదు. గత గురువారం అకాల వర్షానికి దాన్యం తడిసింది. పత్రికల్లో వార్తలు రావడం రైతుల ఆందోళనల మధ్య  గత శుక్రవారం సంచులు గోనె సంచులు వచ్చి కొంతమంది రైతుల ధాన్యాన్ని హమాలీల ద్వారా  కాంట్రాక్టు వేసి సంచుల్లో నింపారు. పార్వతి మల్లయ్య 270 సంచులు, కమలాకర్ రావు కృష్ణ 102 సల్లూరి స్వామి 75 రామారావు 157 లక్ష్మణ స్వామి 150, 40 కిలోల సంచుల్లో వారి ధాన్యాన్ని నింపారు. సంచుల్లో నింపిన వరి ధాన్యాన్ని వెంటనేలారీలలో తరలించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. మళ్లీ ఈరోజు  మధ్యాహ్నం ఆకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం కుప్పలతో పాటు, సంచులలో నింపిన వారి ధాన్యం కూడా తడిసింది. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తహసిల్దార్ దిలీప్ కుమార్  తడిసిన సంచులలోని వారి ధాన్యాన్ని వేరే సంచులలో నింపి తేనే కొనుగోలు చేస్తామని అనడం రైతులకు ఆగ్రహం తెప్పించింది. సంచులలో నింపేందుకు హమాలీలకు క్వింటాల్కు 60 రూపాయలు, సంచుల లో వరి ధాన్యం క్వింటాలకు 5 కేజీలు అదనంగా నింపించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వేరే సంచులలో నింపాలనడంతో ఇదంతా తమకే నష్టం జరుగుతుందని ఒకవైపు ముఖ్యమంత్రి తడిసిన వారి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రకటిస్తుం డగా అధికారులు తడిసిన ధాన్యాన్ని మళ్ళీ ఆరబోయాలని ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. లారీలు తెచ్చుకోకపోవడం అధికారుల తప్పిదం వల్లనే తమ  దాన్యం అకాల వర్షాలకు  తడిసిందని ఇందులో తమ తప్పేముందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండల ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి తమ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలని మండల రైతులు కోరుతున్నారు.