మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఘనంగా నాయక్ పోడ్ సేవా సంఘం వ్యవస్థాపకుడు మద్ది రాంచందర్ 23 వ వర్ధంతి.

 ఘనంగా నాయక్ పోడ్ సేవా సంఘం వ్యవస్థాపకుడు మద్ది రాంచందర్ 23 వ వర్ధంతి.

 నాయక్ పోడ్ నేత  మద్ది రామచందర్ వర్ధంతిలో పాల్గొన్న ఎంపీపీ రోడ్డ లక్ష్మి 


Scv News Kasipet :--

మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలంలోని, దేవాపూర్ (నాయకపుగూడ) గ్రామంలో ఈరోజు ఆదివాసీ అమరుడు మరియు నాయకపోడ్ సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రాంచందర్ 23 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. మద్ది రాంచందర్  ఊరు మందమర్రి వస్తావ్వ్యులు, ఆయన ఆరోజుల్లోనే ఊరు మందమర్రి లో 1/70 చట్టం కొరకు, అదేవిధంగా యువతను చైతన్యవంతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేసి, విద్యాభివృద్ధి కొరకు తన నివాసాన్ని ఒక్క పాఠశాలగా ఎర్పాటు చేసి,చదువు చెప్పించిన గొప్ప మహనీయులు, మద్ది రాంచందర్. నాయక్ పోడ్ గిరిజనుల కోసం అతడు  చేసిన సేవలను సందర్భంగా  కుల సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో MPP రోడ్డ లక్ష్మి,  కొమ్ముల బాపు గారు ఆదివాసీ. నాయకపోడ్ రాష్ట్ర కోశాధికారి ,  ,  తట్ర భీమ్ రావ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరి,బద్ది శ్రీనివాస్  కాసిపేట మండల అధ్యక్షులు.దేవాపూర్ మాజీ సర్పంచ్ కొడప ప్రేమ్ సాగర్          ఆత్రం జoగు  ( తుడుందెబ్బ కాసిపేట మండల అధ్యక్షులు ).రోడ్డ రవీందర్  (కోశాధికారి) తదితరులు పాల్గొన్నారు.