మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్.

 దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్.


Scv News Kasipet :--

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవపూర్ ఓరియంటల్ సిమెంట్ ఫ్యాక్టరీ లో 2వేల కోట్లతో చేపట్టిన 4వ ప్లాంటుకు విస్తరణకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు  హాజరై భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రికి కేటీఆర్ మాట్లాడుతూ నాలుగో ప్లాంటు ఉత్పత్తితో ఈ ప్రాంత అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువకులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మొహ్మద్ మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,దుర్గం చిన్నయ్య , ఆత్రం సక్కు , కోనేరు కొనప్ప ,స్థానిక సర్పంచ్ మడావి తిరుమల, సర్పంచ్ ఆడ జంగు, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు  రామ్మోహన్రావు, ఎంపీపీ రోడ్డ లక్ష్మి , జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ప్రజాప్రతి నిధులు,కంపెనీ అధికారులు పాల్గొన్నారు.