మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  పుట్టినరోజు సందర్భంగా కొమరి మల్లేష్ కు సహాయం.

కొమిరా మల్లేష్ కుటుంబానికి బియ్యం నిత్యావసర వస్తువులు అందచేస్తున్న బారసా నాయకులు కంది ధర్మయ్య, సుధాకర్ రెడ్డి.

Scv News Kasipet:--

కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  పుట్టినరోజు సందర్భంగా కొండాపూర్ గ్రామపంచాయతీ వడ్డెర కాలనీ లోని కొమరి మల్లేష్ అనే వ్యక్తికి గ్రామ బారసా అధ్యక్షులు కంది ధర్మయ్య, సుధాకర్ రెడ్డి  నిత్యావసర వస్తువులను అందచేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కొమరి మల్లేష్ కు ఇటీవల కాలంలోపక్షవాతం రావడం వల్ల వారి కుటుంబ జీవనం కష్టంగా ఉందని తెలుసుకొని కొండాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ కంది ధర్మయ్య, 50 కిలోల బియ్యం సహాయం చేయగా కాసిపేట మండలం బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు సుధాకర్ రెడ్డి  నెలరోజుల సరిపడ కిరాణా సామాన్ ఇప్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొండాపూర్ రైతు సంఘం ప్రెసిడెంట్ పోడేటి రాజా గౌడ్  తాటి గూడ ఉప సర్పంచ్ శ్యామ్ శేఖర్  వల్లెపు కనకయ్య  కొమురె ముత్యాలు బిఆర్ఎస్ పార్టీ విలేజ్ సెక్రటరీ రంగు రమేష్  తదితరులు పాల్గొనడం జరిగింది.