మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 కాసిపేట మండలంలో బోగస్ కళ్యాణ లక్ష్మి పథకం  చెక్కుల పంపిణి పై ఫిర్యాదు.

-  అవినీతి దందాలో  మండల ప్రజా ప్రతినిధులు ఉన్నారంటూ ఆరోపణ?

 కళ్యాణ లక్ష్మి పథకం అవినీతిపై తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్న ముస్తఫా.

Scv News Kasipet:--

ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల వివాహానికి అందించే కళ్యాణ లక్ష్మి పథకం లో  అవినీతి అక్రమాలు జరిగాయని  దీనిపై విచారణ చేయాలని  ఈరోజు షేక్ ముస్తఫా అనే యువకుడు తాసిల్దార్ కు ఫిర్యాదు చేశాడు. గతంలో పెళ్లిళ్లు అయిన వారు  తప్పుడు దృవపత్రాలు సమర్పించి ఇప్పుడే పెళ్లిళ్లు చేసుకున్నట్టు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలలో  మండల అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ నిధులు స్వాహా చేశారని దీనిపై విచారణ జరిపి  చర్యలు తీసుకోకుంటే జిల్లా కలెక్టర్ కుపూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.