ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యచే కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో ని రైతు వేదికలో ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పథకం ద్వారా 81 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల పెండ్లి వివాహ కానుకగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలకు పైచిలుకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదల సంక్షేమం కోసం కెసిఆర్ ప్రభుత్వ ఆయాంలో ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డు లక్ష్మీ, జెడ్పిటిసి పల్లె చంద్రయ్య,వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, తాసిల్దార్ దిలీప్ కుమార్, సహకార సంఘం అధ్యక్షురాలు నీలా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.