మూడవ రోజుకు చేరిన పంచాయతీ కారోబార్ సిబ్బంది సమ్మె.
![]() |
| కేటీఆర్ కు వినతిపత్రం అందజేసేందుకు బెల్లంపల్లికి తరలి వెళ్లిన పారిశుద్ధ సిబ్బంది. |
Scv News Kasipet:--
తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్ మరియు సిబ్బంది సంఘం ఆధ్వర్యం లో తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె నేటికి మూడో రోజు చేరుకుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 51 జీవో ఎప్పటినుండి అయితే అమలు అవుతుందో అప్పట్నుండి ఇప్పటి వరకు మరణించిన కార్మికులను స్మరించుకుంటూ వారికి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అదే విధంగా ఈరోజు మండల పరిషత్ కార్యాలయం లో ప్రజావాణిలో డిమాండ్స్ తో కూడిన వినతి పత్రము అందజేశారు. బెల్లంపల్లి కి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు మండలం లోని కారోబర్లు పంచాయతీ సిబ్బంది బస్సులు తరలి వెళ్లారు.

