గొర్రెల యూనిట్ల పంపిణీ పై సమావేశం.

యాదవ సంఘ సభ్యులతో మాట్లాడుతున్న జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ కుమార్
Scv News Kasipet:--
కాజీపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో ఈరోజు గొల్ల కురుమ యాదవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గొర్రెల యూనిట్ల పంపిణీ రెండవ విడత కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా పశుసంవర్థక అధికారి డా. వై. రమేష్ కుమార్ హాజరై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. గొర్రెల లబ్ధిదారులు సంబంధిత పత్రాలను పశు వైద్యశాలలో సమర్పించటంలో మరియు గొర్రెల యూనిట్లకై డీడీ లు చెల్లించే విషయంలో అలసత్వం వహించద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు ధర్మారావు పేట ఎంపీటీసీ పర్వతి మల్లేష్ గారు, ముత్యంపల్లీ సర్పంచ్ బాదు గారు,తాటిగుడా సర్పంచ్ ముత్యాల స్వప్న గారు, కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల గొర్రెల ప్రాథమిక సంఘాల ప్రెసిడెంట్స్ మరియు యాదవు లు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డా.సంపత్, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.