కాసిపేటగనిలో పదవి విరమణ చేసిన గోదార్ల శంకర్ కు సన్మానం.

ఉద్యోగ విరమణ పొందిన గోదారుల శంకర్ దంపతులకు కంపెనీ బహుమతి అందజేస్తున్న గని మేనేజర్ అల్లావుద్దీన్.
Scv News Kasipet:--
మందమర్రి ఏరియా కాసిపేట గనిలో యాక్టింగ్ వెల్డర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గోదార్ల శంకర్(యాక్టింగ్ వెల్డర్) ఈరోజు మేనేజర్ అల్లావుద్దీన్,యూనియన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించ డం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ 36 సంవత్సర కాలం కంపెనీకి వెల్డర్ గా డ్యూటీలో భాగం అని కాకుండా బాధ్యత గా పని చేసిన వ్యక్తి గోదార్ల శంకర్ అని,వారిని ఆదర్శంగా తీసుకోవా లని అన్నారు.సన్మానాగ్రహిత గోదార్ల శంకర్ మాట్లాడుతూ నేటి యువత వ్యసనాలకు దూరంగా ఉండి,ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడం వల్లనే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. అంతకు ముందు AITUC , TBGKS నాయకులు దాగం మల్లేష్,ఒడ్నాల రాజన్న గార్లు మాట్లాడుతూ శంకర్ కంపెనీకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మంచి పని నైపుణ్యతను చూపించే వారని అన్నారు.ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి సునీల్ కుమార్,AITUC పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మి నారాయణ, సంక్షేమాధికారి గౌస్,బన్న లక్ష్మన్ దాస్,అబ్దుల్, రమేష్, మైఖేల్, రాజేందర్,సోల్లంకి శ్రీనివాస్, వెంకట రాజం, లింగయ్య, సురేష్,బెల్లం అశోక్, నాయకులు, ఫిట్ కమిటీ,సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
