తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.
- బిజెపి మండల ఇన్చార్జి అట్కాపురం రమేష్.
Scv News Kasipet:--
కాసిపేట్ మండలం లోని మల్కపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఐకెపి మొత్తం వడ్లు తడిసి ముద్ద అయినాయని మండల బిజెపి పార్టీ ఇన్చార్జి అట్కాపురం రమేష్ అన్నారు. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను పరామర్శించాడు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ప్రతి రైతుకు ఒక ఎకరానికి 20వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మరియు ప్రతి ఒక్క రైతుకు వడ్ల మీద కప్పుకోవడాని కి టార్పాలిన్ఇవ్వాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించి వడ్లు తొందరగా కొనే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో పడిగేల మహేందర్ బండారి శ్రీనివాస్ తదితర రైతులు పాల్గొన్నారు.

