మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అవయవ దానాలకు ముందుకు వచ్చిన సంకే శ్రావణి దేవి కుటుంబం.

 అవయవ దానాలకు ముందుకు వచ్చిన సంకే శ్రావణి దేవి కుటుంబం.

-మరణానంతరం కూడా మరలా జీవితం అవయవదానంతోనే సాధ్యం.

 అవయవ దానానికి సంబంధించిన ధృవ పత్రాలను శ్రావణి దేవికి అందజేస్తున్న సర్పంచ్ సపాట్ శంకర్, సంకే రవి  

Scv NewsKasipet:--

 మనిషి జీవితంలో మరణం అత్యంత సహజమైన ప్రకృతి సిద్ధమైన అంశం. మరణంలో కూడా పదిమంది జీవితాల్లో వెలుగులు నింపడానికి సిద్దమవడం మనిషికి మాత్రమే సాధ్యమని గుర్తించి నేత్ర, అవయవ, శరీర దానానికి  కాసిపేట మండలం,సోమగూడెం (కె) గ్రామ పంచాయితీ ట్యాంక్ బస్తి వాస్తవ్యులు సంకె శ్రావణిదేవి తన కుటుంబ సభ్యులు సంకె లక్ష్మి,సంకె సుశాంతి లు క్రీ.శె.సంకె శ్రీనివాస్, క్రీ.శే.సంకె లక్ష్మి గార్ల స్మృతిలో ముందుకు వచ్చారు. తేది:13/5/2023 న ముందస్తు నేత్ర,అవయవ, శరీరదాన ఒప్పంద పత్రాలను  సోపతి వెల్ఫేర్ సొసైటీ- జైపూర్ అధ్యక్షులు భీమ్ పుత్ర శ్రీనివాస్ జలంపెల్లి ద్వారా సదశయ పౌండేషన్ కి అందజేయటం జరిగింది.మరణానంతరం కూడా పది మందికి జీవితాన్నిచ్చే, వేల మంది వైద్యులను తయారుచేసే గొప్పబాధ్యత కల్గిన ఈ కార్యక్రమానికి తన కుటుంబం కూడ భాగస్వామ్యం కావాలని ముందుకు రావడం జరిగింది. తన బావ సంకె రవి,అక్క రాజకుమారి కుటుంబంతో స్పూర్తిపొంది ముందుకు వచ్చానని శ్రావణి దేవి అన్నారు.ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన సోమగుడెం(కె) గ్రామ సర్పంచ్ సాపాట్ శంకర్ మాట్లాడుతూ వీరి కుటుంబంలో ఇప్పటికే నాల్గురు వైద్య పరిశోధనకు శరీర దానం చెయ్యడం నేడు మరో ముగ్గురు శరీర దానం చెయ్యడం సంతోషకరమైన విషయం వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది గ్రామస్థులు,దాతలు  నేత్ర,అవయవ, శరీరదానానికి ముందుకొచ్చి అందరికి ఆదర్శంగా నిలవాలని పిలుపు నిచ్చారు.అనంతరం ప్రశంసా పత్రాలు అందజేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో సీపీఎం పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి,నాయకురాలు సంకె రాజ కుమారి, గ్రామ సర్పంచ్ సాపట్ శంకర్,సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు భీమ్ పుత్ర శ్రీనివాస్, సదశయ పౌండేషన్ చైర్మన్ శ్రవణ్ కుమార్ లు, వీణ,బాబ్జీ లు సంకె శ్రావణి దేవి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు.