జై భారత్ సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి.
- వేముల కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.
![]() |
| ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ. |
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఈ నెల 14న శుక్రవారం రోజున ఏఐసిసి మెంబెర్ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆధ్వర్యంజై భారత్ సత్యాగ్రహ దీక్ష, మరియు భారీ బహిరంగ సభ జరుగుతుందని విజయవంతం చేయాలని కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ మండల ప్రజలను కోరారు. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లోవేముల కృష్ణ అధ్యక్షతన శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
రాహుల్ గాంధీ గారి పై అన్హరత వేటు పై నిరసనగా దేశంలో బిజేపి, రాష్ట్రంలో బి ఆర్ యస్ ల నియంత్రుత్వ విధానాలకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జై భారత్ సత్యాగ్రహ దీక్ష, మరియు భారీ బహిరంగ సభ లక్షా మందితో జరుగుతుందని ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (ఏఐసిసి) మల్లిఖార్జున్ ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్,ఛత్తీస్ఘడ్ సీఎం భూపేష్ భాగేల్,మరియు జాతీయ కార్యదర్శులు జైరాం రమేష్,కే.సి వేణుగోపాల్ , రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మానిక్ రావు ఠాక్రే,అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,,సీఎల్పీ భట్టివిక్రమార్క,అలాగే జాతీయ కార్యదర్శులు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన రాష్ట్రంలోని ఉన్న అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి,పోదేం వీరయ్య, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు వస్తున్నారని,అలాగే అదే రోజు భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా అక్కడికి చేరుకుంటుందని, కావున ఈ సభలోనే ఎన్నికల శంఖారావం పూరించిడం జరుగుతుంది అని కాబట్టి మన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఈ కార్యక్రమను విజయవంతం చేయగలరని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాము.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి,యంపిటిసి పార్వతి మల్లేష్,యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామీ ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, సీనియర్ నాయకులు మైదం రమేష్, అంజన్న,ఉడుతల రాజన్న, ఓరియంట్ కంపెనీ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షుడు అన్నం కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు జాడి శివ,ఏల్పూల వెంకటేష్,ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
