దేవాపూర్ లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
![]() |
| బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేస్తున్న కార్యకర్తలు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీలో బిజెపి 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మండల ఇన్చార్జ్ అట్కాపురం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బిజెపి 25 ఏళ్ల క్రితం రెండు ఎంపి స్థానాలు ఉండి ఇప్పుడు 350 స్థానాలతో దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. 43.వ వసంతంలోకి అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్బంగా కాసిపేట్ మండల దేవాపూర్ లోని 7 వ బూత్ అధ్యక్షులు దిలీప్ ఆధ్వర్యంలో జండా ఎగురావేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దేవునూరి సంతోష్, గుంపుల సదయ్య, దోమల రాంచందర్, సురేష్ మాజీ, శేఖర్ అభిరామ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

