వివో ఏ లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ

వివోఏలకు మద్దతుగా నిరసన దీక్షలో కూర్చున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ
Scv News Kasipet:---
కాసిపేట మండల కేంద్రంలోని తెలుగు తల్లి మండల సమాఖ్య కార్యాలయం ముందు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్న వీఈవోలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ మద్దతు తెలిపారు. ఈరోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారితో మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పి, ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేందుకే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే వివోఏ ల ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన తెలుపుతున్న, కనీస స్పందన లేకపోవడం దారుణమని అన్నారు. . వీవోఏల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించా లని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కనీస వేతనం కింద 26 వేల రూపాయలు ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గొలేటి స్వామి, నాయకులు జంగలి రమేష్ వెంకటేష్ ప్రేమ్ కుమార్ నవీన్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.