మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యంపల్లి శాఖ మేనేజర్ రాజేష్ ప్రసాద్ కు సన్మానం.

 తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యంపల్లి శాఖ మేనేజర్ రాజేష్ ప్రసాద్ కు సన్మానం.

బదిలీ పై వెళుతున్న టీజీబీ మేనేజర్ రాజేష్ ప్రసాద్ ను సన్మానం చేస్తున్న స్థానిక నాయకులు.

Scv News Kasipet:--

కాసిపేట మండలం ముత్యంపల్లి టీజీబీ మేనేజర్ గా పనిచేసి బదిలీ పై నస్పూర్ బ్యాంకు కీ వెళుతున్న  సందర్భంగా మేనేజర్ రాజేష్ ప్రసాద్ కు బుధవారం విడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సన్మానం కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ పాల్గోని మాట్లాడుతూ రాజేష్ ప్రసాద్ గారు అతి చిన్న వయసులో పెద్ద బాధ్యత తో ఈ మారు మూల గిరిజన మండలంలోని రైతులకు, ఐకేపీ సంఘాలకు రుణాల విషయంలో చాలా సేవలు అందించారని కొనియాడారు. రాజేష్ ప్రసాద్ మేనేజర్ గా రాక ముందు  వంద కోట్లు ఉన్న ఈ బ్యాంకు ను వంద కోట్ల నలభై లక్షల వరకు సంవత్సరాల కాలంలో చేయడం తన పనితనానికి నిదర్శనం అన్నారు. చాలా ఓపికగా సిబ్బంది తో సమన్వయం చేసుకుంటూ బ్యాంకు అభివృద్ధి కీ పాటుపడ్డారని వీరి సేవలను గుర్తించి మూడువందల కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకు కీ బదిలీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. వీరు మరింత ఉత్సాహాంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అలాగే వీరు భవిష్యత్తులో మంచి ఆరోగ్యంతో, అష్ట ఐశ్వర్యాలతో ఆ కుటుంబానికి ఆ భగవంతున్ని ఆశిస్సులు అందివ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

ఈ కార్యక్రమం లో ధర్మారావుపేట ఎంపీటీసీ పర్వతి మల్లేష్, కాసిపేట ఎంపీటీసీ అక్కపెల్లి లక్ష్మి, స్థానిక నాయకులు రాపర్తి శ్రీనివాస్, నస్పూరి నర్సింగ్, భారస నాయకులు అగ్గిసత్తయ్య పాల్గొని బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్ ను శాలువాలతో సన్మానం చేసారు.