మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఖాతాదారుల మన్ననలు పొందిన టి జి బి బ్యాంక్ మేనేజర్ రాజేష్ ప్రసాద్ బదిలీ.

 ఖాతాదారుల మన్ననలు  పొందిన టి జి బి  మేనేజర్ రాజేష్ ప్రసాద్ బదిలీ.

 బదిలీపై వెళ్తున్న ముత్యంపల్లి టీజీబీ బ్యాంక్ మేనేజర్ రాజేష్ ప్రసాద్


Scv NewsKasipet:--

కాసిపేట మండల కేంద్రంలోని  తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా గత రెండు సంవత్సరాలుగా ఖాతాదారులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు విశేష సేవలు అందిస్తూ వారి ఆధార అభిమానాలు పొందిన బ్యాంకు మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ బదిలీ అయ్యారు. రెండు సంవత్సరాలలో టి జి బి బ్యాంకును అన్ని రంగాలలో ముందుంచి కోట్లాది నిధుల లాభాల బాటలో నడిపారు. మంచిర్యాల జిల్లాలోనే అత్యధిక రుణాలు మహిళా సంఘాలకు ఇవ్వడం, వసూలు చేయడంలో టి జి బి బ్యాంకును ప్రధమ స్థానంలో నిలిపారు. గత ఫిబ్రవరి నెలలో మంచిర్యాల టి జి బి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయల చెక్కులను  కాసిపేట బెల్లంపల్లి మందమర్రి మహిళా  స్వయం సహాయక  సంఘాలకు బ్యాంకు పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇప్పించడంలో క్రియాశీల పాత్ర పోషించారు. బ్యాంకు రుణాలతో పాటు సామాజిక సమస్యలు,ఆర్థిక అక్షరాస్యత, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి స్థానిక ప్రజల అభిమానాన్ని చురగో న్నారు. బదిలీపై ఈనెల 25న మేనేజర్ రాజేష్ ప్రసాద్  సీసీ కార్నర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్తున్నారు . గత రెండు సంవత్సరాలుగా  మండలంలోని వివిధ గ్రామాలలో ఖాతాదారులకు, మహిళా సంఘాలకు మెరుగైన సేవలు అందించిన మేనేజర్ రాజేష్ ప్రసాద్ కు పలువురు అభినందనలు తెలిపారు.