మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

జూనియర్ సివిల్ జడ్జిగా కాసిపేట మండల వాసి బాణావత్ రాజేశ్వర్ ఎంపిక.

 జూనియర్ సివిల్ జడ్జిగా కాసిపేట మండల వాసి బాణావత్ రాజేశ్వర్  ఎంపిక.

 సివిల్ జడ్జిగా ఎంపికైన బానోత్  సన్మానిస్తున్న కోమటి చేను సర్పంచ్ రామ టెంకి శ్రీనివాస్.

Scv News Kasipet:-

 కాసిపేట మండలం కొత్త వారి పేట గ్రామానికి చెందిన బాణావత్ రాజేశ్వ ర్ జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపికయ్యారు. కొత్తవరిపేటకు చెందిన బాణోత్ కిషన్, లక్ష్మి దంపతుల కుమారుడు బాణోత్ రాజేశ్వర్ గారు జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపిక అయిన సందర్భంగా కోమటిచెను సర్పంచ్ రామటేంకి శ్రీనివాస్ , ఉపసర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్,వార్డు సభ్యులు బాణోత్ లక్ష్మణ్, కొత్తవరిపేటకు చెందిన పెద్దమనుషులు మరియు యువకుల ఆధ్వర్యంలో గ్రామంలో ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రామ టెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ మా గ్రామపంచాయతీ నుండి జడ్జిగా ఉద్యోగం సంపాదించడం మాకు ఎంతగానో గర్వకారణం అని తెలుపుటకు సంతోషి స్తూన్నాన్నారు. రాజేశ్వర్ ను స్ఫూర్తిగా తీసుకొని యువకులు చదువుకోని  ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

సివిల్ జడ్జిగా ఎంపికైన బాణోత్ రాజేశ్వర్ మాట్లాడుతూ మా తల్లిదండ్రుల ప్రోత్సాహం తోనే నేను జాబ్ కొట్టానన్నారు. మా గ్రామంలోని యువకులకు తనవంతుగా చదువుకోవడంలో మరియు జాబులు సాదించడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

రాజేశ్వర్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై కాసిపేట మండలానికి జిల్లా స్థాయిలో పేరు తెచ్చినందుకు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపు తుంది.