మనువాద బ్రాహ్మణ వర్గం
కుట్రలతో చరిత్రలో
కనుమరుగైన బహుజన
వీరుడు సర్దార్ సర్వాయి
పాపన్న గౌడ్.
-పల్లె మల్లయ్య,సామాజిక
చైతన్య వేదిక అధ్యక్షుడు.
![]() |
| కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో మొకు దెబ్బ ఆధ్వర్యంలో పాపన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. |
Scv News Kasipet :--
తెలంగాణలో మూడు దశాబ్దాలకు పైగా పరిపాలన సాగించిన బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ను మనువాద బ్రాహ్మణ వర్గం కుట్రపూరితంగా చరిత్రలో కనుగుమరుగు చేసిందని సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య అన్నారు. ఆదివారం కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313 వ వర్ధంతి కార్యక్రమం మండల మోకు దెబ్బ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ బ్రాహ్మణీయ చాతుర్వారణ సిద్ధాంతం ప్రకారం క్షత్రియులే రాజ్యం పాలన చేయాలి. సర్వాయి పాపన్న చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని పాతరేసి సబ్బండ వర్గాల అండతో తెలంగాణ ను 30 సంవత్సరాలు పరిపాలించి, 22 కోటలు నిర్మించిన పోరాట యోధుడని కొని యాడారు. చాతుర్వాన సిద్ధాంతానికి వ్యతిరేకంగా శూద్ర కులస్తుడైన పాపన్న రాజ్యమేలడాన్ని బ్రాహ్మణ మనువాద వర్గం సహించలేకపోయిందన్నారు. చదువు వారి చేతుల్లో ఉండడం వల్ల భారతదేశ చరిత్రలో వారి కి స్థానం లేకుండా బందిపోటుగా చిత్రీకరించా రన్నారు. బ్రిటిష్ వారి హాయంలో ఆంగ్ల చరిత్రకారుడు బోయర్ పాపన్న వీర చరిత్రను వెలికి తీసి ఇంగ్లాండ్ లైబ్రరీలో భద్రపరచాడన్నారు. ఆంగ్లేయుల కృషితోనే బాహ్య ప్రపంచానికి బహుజన పోరాట యోధుడు పాపన్న చరిత్ర తెలిసిందన్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో గౌడ కులస్తులు ఐకమత్యమై బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ పేద బహుజన గౌడ కులంలో పుట్టి 30 ఏళ్లు రాజ్యపాలన చేసిన బహుజన వీరుడని గుర్తు చేశారు. పాపన్న పోరాట స్ఫూర్తిని గౌడ కులస్తులంత ఆదర్శంగా చేసుకొని పోరాడాలన్నారు. పోరాట గౌడ వంశంలో పుట్టిన గౌడులు నేడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకుండా బానిసత్వంలో మగ్గడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ కులస్తులందరు ఏకమై బహుజన రాజ్య స్థాపనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
యువ నేత సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న కల్లు గీసే కత్తితోనే పోరాడి బహుజన రాజ్యాన్ని స్థాపించిన వీరుడని కొనియాడారు. ఆ పోరాట యోధుడి స్ఫూర్తిగా గౌడ కులస్తులమంతా ఏకమై బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాలని అన్నారు.
మోకు దెబ్బ కాసిపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు మార్క శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మండలంలోని గౌడ కులస్తులమంతా ఏకమై సంఘ బలోపేతం కృషి చేయాలి అన్నారు.
భరాసా నాయకుడు రంగు రమేష్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న ఒక్క కులానికే చెందిన వాడు కాకుండా తెలంగాణలోని అన్ని వర్గాలకు చెందిన నాయకుడా న్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో బహుజన వర్గాలమంతా ఏకం కావాలన్నారు.
కార్యక్రమానికి ముందు పాపన్న గౌడ్ చిత్రపటానికి గౌడ సంఘం సీనియర్ నాయకులు నేరెల్లి బుగ్గయ్య గౌడ్ ,పడాల మల్లేష్ గౌడ్, కొండాపూర్ ఉప సర్పంచ్ పోడేటి సుమన్ గౌడ్ పూల మాలవేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో మండల మోకు దెబ్బ నాయకులు శ్రావణ్ గౌడ్, నేరెల్లి నర్సింగం,రవి, కోడూరి గురువయ్య, పోడేటి ప్రేమ్ సాగర్, మార్క మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






