బ్రాహ్మణీయ మనువాద దోపిడి గుట్టు రట్టు చేసిన మహాత్మా పూలే.
- పల్లె మల్లయ్య,సా చై వే అధ్యక్షు డు
Scv News Kasipet:--
భారతదేశంలో గత రెండు వేల సంవత్సరాలుగా బహుజన వర్గాలను బ్రాహ్మణీయం మనువాద వర్గం కులాలుగా విడగొట్టి, విద్యకు దూరం చేసి దోపిడి చేస్తున్నా యని సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య అన్నారు.
కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి కార్యక్రమం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బహుజన వర్గం అధికారంలోకి రాలేకపోతుం దన్నారు. దేశంలో 85 శాతం ఉన్న బహుజన వర్గాలను వేల కులాలుగా విడగొట్టి 15 శాతం ఉన్న అగ్రవర్ణాల బ్రాహ్మణ మనువాదులు దోపిడీ చేస్తూ పరిపాలన చేస్తున్నా రన్నారు.దేశంలో బహుజన వర్గాల అందరికీ విద్యా బోధన చేసిన మొదటి ఉపాధ్యాయు లు మహాత్మా పూలే,సావిత్రి పూలే లని వీరిని మనువాద చరిత్రకారులు గుర్తించకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట ఉపాధ్యాయ దినోత్సవాలు జరుపుతున్నారని విమర్శించారు. బహుజన వర్గాలమంతా ఐకమత్యం తో మనువాద కుట్రలను అంబేద్కర్ పూలే ఆలోచనలతో తిప్పి కొట్టి బహుజన రాజ్యం కోసం ఉద్యమించాలన్నారు.
విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కార్యదర్శి శిలోజీ మురళి మాట్లాడుతూ భారతదేశంలో బహుజన వర్గాలకు చదువు నేర్పిన మొదటి గురువు మహాత్మా పూలే అని కొనియాడారు. బహుజన కులాలంతా మహాత్మా పూలేను గుర్తుంచు కోవాలన్నారు. కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులు మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
మాదిగ దండోరా,ఎమ్మెస్ పి జిల్లా ఇన్చార్జి కలవల శరత్ మాట్లాడుతూ దేశంలో మనువాద బ్రాహ్మణ వర్గ దోపిడిని మొట్టమొదట గుర్తించింది మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. బ్రాహ్మణ దోపిడీ నుండి బహుజన వర్గాలను విముక్తి చేసేందుకు విద్యా బోధన తో జ్ఞానవంతులు చేయాలనే లక్ష్యంతో పాఠశాలలు ప్రారంభించా డన్నారు. బహుజన వర్గాలంతా మహాత్మా పూలే, అంబేద్కర్ ఆలోచనలతో బహుజన రాజ్యం కోసం ఉద్యమించాలని అన్నారు.
సామాజిక చైతన్య వేదిక నాయకులు మెంద్రపు రాజన్న మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని బహుజన వర్గాలు చైతన్యం కావాలన్నారు.
సామాజిక చైతన్య నాయకుడు కురిసింగ మోహన్ మాట్లాడుతూ బహుజన వర్గాల విద్య కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి జ్యోతిబాపూలే అని కొనియాడారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జీవిత విశేషాలను వివరించారు. ప్రజా సంఘాలు కుల సంఘాలు జ్యోతిరావు పూలే జన్మదిన ని ఘనంగా జరుపుకోవాలని కోరారు. బహుజనుల మేధావుల త్యాగాలపై చక్కటి పాటను పాడారు. సమావేశానికి ముందు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చార్యులు, ముత్యం పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు చింతోజు ప్రభాకర్ చార్యులు, ప్రధాన కార్యదర్శి శిరోజూ శ్రీనివాసా చార్యులు పట్టణ కోశాధికారి సిలోజు నరసింహ చార్యులు, కార్యవర్గ సభ్యులు కంచి శంకరాచార్యులు, తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మడవి వెంకటేష్, నాయక్ పోడ్ సేవా సంఘం సాంస్కృతిక కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.







