జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా కేంద్రంను,సందర్శించిన మండల రైతులు, ప్రజా ప్రతినిధులు.
![]() |
| పోలాస పాలిటెక్నిక్ విద్యార్థులతో మండల ప్రజాప్రతినిధులు వ్యవసాయ అధికారులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల రైతులు,ప్రజాప్రతినిధులు ఈరోజు జగిత్యాల జిల్లా పోలాస వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కళాశాల, వ్యవసాయ క్షేత్రాన్ని, పరిశోధనా సైంటిస్ట్ లు, సీనియర్ విద్యార్థులచే సర్పంచి వేముల కృష్ణ, మండల రైతులు సందర్శిం చారు. కాసిపేట మండలంలోని రైతులతో కలిసి వ్యవసాయ సాగుకు సంబంధించి, సైంటిస్ట్ లు మరియు సీనియర్ విద్యార్థులు చేస్తున్న పంటలకు సంబంధించిన విద్యార్థుల ద్వారా తెలుసు కున్నారు. కళాశాలలోని పలు పంటలను దగ్గర నుంచి పరిశీలించి, పంట సాగుకు సంబంధించి నువ్వుల పంట, స్వీట్ కార్న్,వరిపంట, పత్తి సాగుల ద్వారా తెలుసుకోవాల్సిన మెలకువలను రైతులకు సీనియర్ విద్యార్థులు వివరించారు. భూసార పరీక్షలు చేసుకోవడం ద్వారా ఏ సమయంలో,ఏ పంట సాగు చేసుకుంటే దిగుబడి లాభాలు అధికంగా ఉంటాయో వాటిని వివరించారు.. సేంద్రియ సాగు చేసుకుంటే వచ్చే లాభాలతో పాటు ఉపయోగాలను తెలియజేశారు . సాగును పరిశీలించిన రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు. విన్నతమైన పంటలు సాగుకు శ్రీకారం చుట్టాలని రైతులను కోరారు..ఈ సందర్శనలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఆదర్శ రైతు దాడి పెంటయ్య, రైతులు మార్క మహేష్,మారం సురెందర్,ఆయిలి శంకర్ ,నారిశెట్టి ప్రనయ్, నవీన్ లు పాల్గొన్నారు.

