బుద్ధిష్టు మనోహర్ కాంబ్లెకు అంబేద్కర్ సంఘం సన్మానం.
ఓరియంట్ అధికారిగా పదవి విరమణ పొందిన బుద్ధిష్టు మనోహర్ కామ్లేను సన్మానిస్తున్న అంబేద్కర్ యువజన సంఘం నాయకులు |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవపూర్ అంబేద్కర్ భవన్లో శనివారం రాత్రి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఓరియంట్ అధికారిగా పదవి విరమణ పొందిన బుద్ధిష్టు మనోహర్ కామ్లేను ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మనోహర్ కాంబ్లే గత ఆరు సంవత్సరాలుగా ఓరియంటులో విధులు నిర్వర్తిస్తూనే దేవాపూర్ లో అంబేద్కర్, బుద్ధిస్తూ భావజాలా ప్రచారానికి ఎనలేని కృషి చేశారని అంబేద్కర్ సంఘ నాయకులు కొనియాడారు. కాంబ్లే కృషి వల్ల దేవాపూర్ లో అంబేద్కర్ భావజాలానికి ఆకర్షితులై చైతన్యవంతులయ్యారని అన్నారు. చివరగా మనోహర్ కాంబ్లే మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలంటే కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో సభ్యులంతా హాజరు కావాలని అన్నారు. అంబేద్కర్ను పూజించడం కాదు అతడి ఆలోచనలను ఆచరణలో పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమం దేవపూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గసికంటి మల్లేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో మద్దిమడ సర్పంచ్ అడే జంగు, దేవపూర్ సర్పంచ్ మడవి ఆనంత రావు, అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు వడ్లూరు మల్లేష్ కొమ్ముల బాపు, గడ్డం పురుషోత్తం, రాజమౌళి, రామిల్ల క్రిష్టయ్య, రాందాస్ , పల్లె మల్లయ్య మహిళా మండలి సభ్యురాలు రజని పాలేకర్ మనోహర్ కామ్బ్లే అంబేద్కర్ భావజాల ప్రచారానికి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో దేవాపూర్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు లచ్చన్న, బాపు చిలుముల మల్లేష్, పోశం అంబేద్కర్ సొసైటీ మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

