బదిలీపై వెళ్తున్న కాసిపేట -2 మేనేజర్ కు సన్మానం.
Scv News Kasipet : --
మందమర్రి ఏరియా కాసిపేట -2 గని మేనేజర్ మాటూరి రవీందర్ పదోన్నతి పై ఏఎస్ఓగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా మైనింగ్ స్టాప్ ఈరోజు గని క్యాంటీన్ హాల్లో ఘనంగా సన్మానం చేశారు. జనరల్ షిఫ్ట్, ఏ, బి షిఫ్టులకు చెందిన మైనింగ్ స్టాప్ పూలమాల శాలువాలతో సన్మానించి గని మేనేజర్ రవీందర్ దంపతుల చిత్రపటంతో కూడిన దేవాలయం మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా గని సూపర్వైజర్లు, గుర్తింపు కార్మిక సంఘ నాయకులు శ్రీనివాస్ కారుకురి తిరుపతి లు మేనేజర్ చేసిన సేవలను కొనియాడారు. బదిలీపై వెళ్తున్న గని మేనేజర్ రవీందర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు అయిన గనిలో ఉత్పత్తి కంటే రక్షణ పైనే శ్రద్ధగా తీసుకొని పనిచేయడం జరిగిందన్నారు. నాలుగేళ్లుగా అన్ని విధాల సహకరించిన మైనింగ్ సంబంధి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అండర్ మేనేజర్ నాగేశ్వరరావు, సంక్షేమ అధికారి భార్గవ్ , సర్వే అధికారి ప్రకాష్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ సెగ్గం శ్రీనివాస్ ,ఓర్ మేన్లు లింగాల శ్రీనివాస్, గణేష్, సుభాష్, సతీష్, అభిద్ షరీఫ్ మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

