మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన దుబ్బగూడం వాసులు

 పునరావాస సమస్యలు తీర్చాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కు  దుబ్బగూడం వాసుల విన్నపం.

  మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వినతి పత్రం  ఇస్తున్న దుబ్బగూడెం వాసులు ఓరం కపిరాజు బెంబడి  మహేష్ లు. 

Scv News Kasipet:--

 బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని దుబ్బగూడం గ్రామం కేకే ఓసి లో ముంపుకు గురవుతుందని తమకు అందాల వలసిన పునరావాస ప్యాకేజీ అందడం లేదని ఈరోజు దుబ్బగూడం వాసులు ఓరం కవిరాజ్ బెంబడి మహేష్ లు మంత్రి కొప్పుల ఈశ్వర్లు ధర్మపురిలో కలిసి వినతి పత్రం అందజేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, పునరావాస  స్థలంలో అభివృద్ధి పనులను ప్రారంభించాలి, ప్యాకేజ్ కి సంబంధించిన పిడిఎఫ్లు విడుదల చేయాలి. తదితర డిమాండ్ల పై వినతి పత్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ కు  అందజేశారు. వీరి సమస్యలు వెంటనే పరిష్కరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ మందమర్రి జిఎ ను ఆదేశించారని దువ్వగూడం వాసులు గోరం కవిరాజు బెంబడి మహేష్ లు తెలిపారు.