మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట గని పై ఉత్పత్తి ఉత్పాదకతపై,వార్షిక లక్ష్యాలపై సమావేశం

 కాసిపేట గని పై ఉత్పత్తి ఉత్పాదకతపై,వార్షిక లక్ష్యాలపై సమావేశం.

 కాసిపేట గనిలో ప్రతిభ కనబరిచిన కార్మికులకు బహుమతులు అందజేస్తున్న ఏజెంట్ కుర్మ రాజేందర్.

కాసిపేట గనిలో ప్రతిభ కనబరిచిన కార్మికులకు బహుమతులు అందజేస్తున్న ఏజెంట్ కుర్మ రాజేందర్.

Scv News Kasipet:--

కాసిపేట గని పై 2023-24 వార్షిక సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాలను, రక్షణ ఆవశ్యతను తెలియజేస్తూ కాసిపేట గనిలో వివిధ కేటగిరీలలో ప్రమోషన్లు పొందిన వారికి ప్రమోషన్ పత్రాలను గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్ మేనేజర్ అల్లావుద్దీన్ అందజేశారు. ఈ సందర్భంగా కాసిపేట గ్రూప్ ఏజెంట్ రాజేందర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం కాసిపేట గని తోపాటు కాసిపేట వన్ టన్నల్ పనులు మొదలవుతాయని అన్నారు.కాసిపేట గనికి అవసరం 2,40,000 టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే కాశిపేట 1 టన్నల్ ఆర్థిక సంవత్సరంలో లక్ష టన్నుల ఉత్పత్తిని ( 3.40 లక్షలు) తీయాలనే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. గనిలో వివిధ కేటగిరీలలో ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కృషిచేయాలని ఎందుకు లక్ష్యంతో పనిచేయాలని అన్నారు.అనంతరం రక్షణ అధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదాలను నివారించుటకు రక్షణలో పని చేయాలని అన్నారు.గని మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ గతంలో వార్షిక లక్ష్యాన్ని చేరుకోవడానికి వెనుకబడి ఉన్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గని లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ బైరి శంకర్ ఏరియా కార్యదర్శి వడ్నాల రాజన్న ఏఐటియూసి పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మినారాయణ, మధుకర్, డిప్యూటీ మేనేజర్ నిఖిల్, వెంకటేష్ ,సర్వేయర్ వెంకటేశ్వర్లు, సంక్షేమ అధికారి మీర్జాజి గౌస్ తదితరులు పాల్గొన్నారు.