మందమర్రి యస్ ఐ పై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్.
Scv News Kasipet:--
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపై దురుసుగా వ్యవహరించిన మందమర్రి ఎస్సై చంద్రకుమార్ పై చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దనపల్లి సర్పంచి వేముల కృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు కాసిపేట మండల కేంద్రంలో వేముల కృష్ణ మాట్లాడుతూ 15 వ తారీఖు రోజున దళిత సామాజిక వర్గానికి చెందిన బెల్లంపల్లి మండలంలోని చాకెపల్లి యంపిటీసి యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్ మందమర్రి పోలీస్ స్టేషన్ లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ పై వచ్చిన ఫిర్యాదు విషయం లో వెళ్ళి యస్ ఐ చంద్ర కుమార్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా దురుసుగా ప్రవర్తించాడని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రజా ప్రతినిధులకే ఈ విధంగా ఉంటే సాధారణ మనుషులకు ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఒక వైపు పోలీస్ స్టేషన్ కీ ఎవరు వచ్చినా వారితో మర్యాద తో పాటు ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండాలని చెబుతుంటే ఈ యస్ ఐ గారు మాత్రం ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. దళిత జాతీకీ అవమానంగా బావిస్తు వెంటనే పోలిస్ ఉన్నత అధికారులు ఎస్సై పై చర్యలు తీసుకోని అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన దళిత సర్పంచ్ గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెన్నెల మండల గుండ్ల సోమారం యంపిటీసి దాగం రమేష్, డిసిసి సభ్యులు లవుడియ రమేష్, తదితరులు పాల్గొన్నారు
