ఆదివాసి గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలి... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ.

ఐటీడీఏ పీవో కార్యాలయంలో వినతిపత్రం అందచేస్తున్న వేముల కృష్ణ.
Scv News Kasipeta :--
కాసిపేట మండలంలోని వెంకటాపూర్, రొట్టెపల్లి, తిరుమలపూర్, పెద్దనపల్లి నాయకపుగుడా, సోనాపూర్ గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు లేనందున గర్భిణీ స్త్రీలు బాలింతలకు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు 15 కిలోమీటర్ దూరంలో ఉన్న మండల కేంద్రానికి రావాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ అన్నారు. ఈరోజు ఐటీడీఏ ప్రాజెక్టు ఉట్నూర్ కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు. కాసిపేట మండలం పూర్తిగా ఏజెన్సీ మండలం కావడంతో, ఈ గ్రామాల్లో మెరుగైన వైద్యం అందే విధంగా ఉండేందుకు వెంకటాపూర్, నాయకపుగుడెంలో (పెద్దనపల్లి) ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తుంది తప్ప, ఆదివాసి గ్రామంలో ఎలాంటి వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని అన్నారు. ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి స్పందించి ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు .