నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు.
![]() |
| ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పిస్తున్న నాయకుడు సేవా సంఘం నాయకులు. |
Scv News Kasipet :--
మంచిర్యాల్ జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ పంచాయితీ పరిధిలో గల నాయకపు గూడలో ఆదివాసి నాయక పోడు సేవ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి అమరవీరుల చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి నాయక పో డు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు మాట్లాడుతూ తరతరాల నుండి వడ్డీ వ్యాపారస్తుల నుంచి రాజకీయ దోపిడీదారుల నుండి విముక్తి కావాలని ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలివ్వాలని, అడవి అధికారుల ఆగడాలు నిలిపివేయాలని 19 81 ఏప్రిల్ 20న గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్ర వెళ్లి లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పోలీసులు సభకు అనుమతి లేదనే కారణంగా ఆదివాసీలపై విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఎంతోమంది ఆదివాసీలను చంపడం దారుణ మన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలి ఇవ్వాలి, రాజ్యాంగబద్ధంగా ఆదివాసి చట్టాలను అమలు చేయాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో రెడ్డి లక్ష్మణ్ ఆదివాసి నాయక పోడ్ సేవా సంఘం కాసిపేట మండల సాంస్కృతిక కార్యదర్శి, కొమ్ముల రజిత ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి,మేకల సునీల్ బుర్ర మనోజ్ సండ్ర మహేష్ కొమ్ముల సంజీవ్ మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

