గౌడ కులస్తులంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలి.
- మార్క శ్రీనివాస్ గౌడ్, మండల మోకు దెబ్బ అధ్యక్షుడు
![]() |
| కొండాపూర్ గ్రామంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న మండల గౌడ కులస్తులు. |
Scv News Kasipet:--
మండలంలోని అన్ని గ్రామాల గౌడ కులస్తులమంతా ఐకమత్యంతో సంఘ పాటిష్టానికి కృషి చేయాలని మండల మోకు దెబ్బ అధ్యక్షుడిగా ఎన్నికైన మార్క శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ రోజు కాసిపేట మండలం కొండాపూర్ యాప గ్రామంలో మోకు దెబ్బ మండల శాఖ ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో గౌడ కులస్తులను ఉద్దేశించి
మార్క శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గౌడులందరి సహకారంతో సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తానని హక్కుల కోసం ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు సహాయశక్తులకు కృషి చేస్తానని అన్నారు.
మోకు దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రాజయ్య మాట్లాడుతూ తెలంగాణలో గౌడ కులస్తులు ఐకమత్యంగా ముందుకు వెళ్లి హక్కులు సాధించుకోవాలని అన్నారు. మండలం లోని వివిధ గ్రామాలలో గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతినెల లో ఒకరోజు సమావేశమై చర్చించు కోవాల న్నారు. గ్రామ కమిటీల ద్వారా ప్రతినెల 100 రూపాయల పొదుపు చేసు కోవాలని సూచించారు. మండల సలహాదారు సింగిల్ విండో ఉపాధ్యక్షుడు తాటిపాముల శంకర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘాన్ని పటిష్టం కొరకు యువత ముందుకు రావాలని అన్నారు. రైతులు తమ పంట చేన్లలోని ఈత తాటి వనాలను నరుకుతున్నారని వీటిని అరికట్టాల న్నారు. మండల సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ బహుజన వర్గాలలో గౌడులు అత్యధిక సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాల నిర్లక్ష్యం వల్ల న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్ర జనాభాలో 30 లక్షల మంది ఉండి 15 నుండి 16 ఎమ్మెల్యే స్థానాలు రావాల్సి ఉన్న నాలుగింటికి పరిమితమయ్యాయి అని అన్నారు. గౌడులంతా రాజకీయ చైతన్యంతో రాజ్యాధికారం కొరకు ఐకమత్యంతో ఉద్యమించా లన్నారు. సలహాదారు బుర్ర లింగన్న గౌడ్ మాట్లాడుతూ రాజకీయాల కతీతంగా గౌడ కులస్తుల హక్కుల కోసం కృషి చేయాలన్నారు. మండలంలోని కొన్ని గ్రామాలలో ఇతర కులస్తుల కూడా గౌడ వృత్తి చేస్తున్నారని వాటి విషయమై మండల కమిటీ పట్టించు కోవాలన్నారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి పోడేటి రాజ గౌడ్, యూత్ అధ్యక్షుడు కొయ్యడ అంజన్న గౌడ్, యూత్ కమిటీ సలహాదారు కోడూరి విద్యాసాగర్ మాట్లాడారు. తధనంతరం మండల నూతన కమిటీ అధ్యక్షులు గా ఎంపికైన మార్క శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పోడేటి రాజ గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ గౌడ్, రాజబాబు గౌడ్లతో పాటు సలహాదారులను మండల కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
తధానంతరం మండల గౌడ యూత్ కమిటీని ఎన్నుకున్నారు. గౌడ యువత అధ్యక్షుడిగా కొయ్యడ అంజన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గడ్డం ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా శ్రావణ్ గౌడ్, ఉపాధ్యక్షులు గా, బైరి నరేష్ గౌడ్, కోడూరి శ్రావణ్ గౌడ్, సహ కార్యదర్శిగా తాటిపాముల కిరణ్ గౌడ్, కోశాధికారిగా బుర్ర ప్రకాష్ గౌడ్ లను యూత్ కమిటీ సలహాదారుడు కోడూరి విద్యాసాగర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి గౌడ కులస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.





