కాసిపేట మండల గౌడ సంఘ సభ్యుల సమావేశం.
మండల కమిటీ ఎంపిక.
![]() |
| కొండాపూర్ లో కాసిపేట మండల గౌడ కులస్తుల సమావేశం |
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల గౌడ కులస్తుల సమావేశం కొండాపూర్ యాపలో ఈరోజు జరిగింది. గౌడ కులస్తుల సమస్యలపై చర్చించి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షుడిగా మార్గ శ్రీనివాస్ గౌడ్ ( కాసిపేట), ప్రధాన కార్యదర్శిగా పోడేటి రాజ గౌడ్ ( కొండాపూర్ ), ఉపాధ్యక్షులుగా భాస్కర్ గౌడ్ (దేవా పూర్ ), పడాల మల్లేష్ గౌడ్ ( ధర్మ రావు పేట ), జాయింట్ సెక్రటరీ గా తాటిపాముల రాజ బాబు గౌడ్ ( మల్కపల్లి), కోశాధికారిగా శేఖర్ గౌడ్ పల్లం గూడెం, సలహాదారులు తాటిపాముల శంకర్ గౌడ్, నేరెల్లి బుగ్గయ్య గౌడ్ పల్లె మల్లయ్య గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ఈ నెల 23వ తేదీన వచ్చే ఆదివారం ఇదే స్థలంలో గౌడ సంఘ ఆత్మీయ సమ్మేళనం జరపాలని గ్రామ కమిటీలను యూత్ కమిటీని ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
