మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గడ్డం సురేష్ కు సోమ గూడెం పాతబస్తివాసుల సన్మానం.

 'దసరా' సినిమా లో నటించి మొదటి సారి గ్రామానికి వచ్చిన గడ్డం సురేష్ కీ పాతబస్తీ వాసుల ఘన సన్మానం.

  గడ్డం సురేష్ ను సన్మానిస్తున్న సోమగూడెం పాత బస్తీ వాసులు.


Scv News Kasipet:--

 కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ కీ చెందిన గడ్డం సురేష్  దసరా సినిమా లో నటించి మొదటిసారి గ్రామానికి వస్తున్న సందర్భంగా సోమవారం  గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులు  ఘనంగా స్వాగతం పలికి పంచాయతీ కార్యాలయం లో సన్మానం చేశారు. ఈ కార్యక్రమం నుద్దేశించి సర్పంచ్ వేముల కృష్ణ  మాట్లాడుతూ ఈ రోజు  సినిమారంగంలో ఎలాంటి అండదండలు లేకున్నా  తన టాలెంట్ తో ఈ పాన్ ఇండియా సినిమా దసరా సినిమా లో న్యాచురల్ స్టార్ నాని తో గడ్డం సురేష్ అన్న  నటించి తెలంగాణ యాసలో పాటలు డైలాగులు వ్రాసి మా గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినందుకు మా గ్రామస్తులకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. సోమ గూడెం పాతబస్తికి ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. సురేష్ అన్న  భవిష్యత్తులో మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు నడువాలాని,మంచి అవకాశాలు  సినిమారంగంలో రావాలని అలాగే ఆ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లా వేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటు న్నానన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొత్త రమేష్ పంబాల తిరుపతి కంచర్ల పద్మ, మాజి సర్పంచ్ కామేర శ్రీనివాస్, పంచాయతీ కారోబార్ సిలోజ్ మురలి. మాజి వార్డు సభ్యులు కల్వల జమున, నాయకులు గాదం గట్టయ్య శ్రీనివాస్, రాజు, మధు, అబిబ్ రాజేశ్వరి గ్రామ పెద్దలు వేముల చంద్రయ్య, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిండుగా దీవేనలు అందించారు.