మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఘనంగా చేనేని భీమయ్య 35వ వర్ధంతి కార్యక్రమం.

 మద్దిమడలో ఘనంగా అమరుడు చెనేని బీమయ్య 35వ వర్ధంతి.

 చేనేని భీమయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకపోడ్ సేవా సంఘం నాయకులు. 



Scv News Kasipet:--

 కాసిపేట మండలం మద్దిమడ గ్రామంలో  ఈరోజు ఆదివాసీ అమరుడు చెన్నేని భీమయ్య  35 వ వర్ధంతి కార్యక్రమం ఆదివాసీ నాయక్ పోడు  సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  మద్దిమాడ గ్రామంలో వారియొక్క కుటుంబ సభ్యుల ఇంటి నుండి పూజ సామగ్రి తీసుకొని కుల ఆచార సంప్రదాయం ప్రకారం తెప్పటగుళ్ళ తో ఊరేగింపు గా వారి యొక్క విగ్రహం వద్దకి వెళ్లి   కుటుంబ సభ్యులతో పూజ నిర్వహించారు.  తర్వాత  నాయకులు  ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. చేన్నెని భీమయ్య ఆదివాసి హక్కుల కోసం జరిగిన పోరాటము  ప్రాణ త్యాగాల గురించి  ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, మద్దిమాడ గ్రామ సర్పంచ్ ఆడ జంగు, ఆదివాసీ నాయకపొడ్ సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు,మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు సోయం జంగు,  జిల్లా అధ్యక్షులు మడవి వెంకటేష్ లు మాట్లాడారు.  కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కనక రాజు,నాయకపొడు సంఘం మండల ఉపాధ్యక్షులు బీమిని మహేందర్, సాంస్కృతిక  కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్, కార్యదర్శి మంగ శ్రీకాంత్,మహిళా కార్యదర్శి,సోమని పోషక్క,రెడ్డి భారతి, ఉద్యోగ సంఘ నాయకులు నాయుడి మల్లేష్, సండ్ర భూమయ్య, మద్దిమాడ గ్రామ అధ్యక్షులు బద్ది శ్రీనివాస్,పెద్దనపల్లి గ్రామ అధ్యక్షులు లవుడం నవీన్, మద్దిమాడ గ్రామపెద్ద రోడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు.