కాసిపేట, పల్లం గూడెం గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.
![]() |
| కాసిపేట వల్లంగుడ గ్రామాలలో సీసీ కెమెరాలను ప్రారంభించిన మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో నేరాల నియంత్రణ కోసం కాసిపేట పల్లం గూడెం పంచాయతీ పరిధిలోని ప్రధాన వీధులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రెండు గ్రామాలలోని సీసీ కెమెరా లను మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నియంత్రణ లో స్వీయ రక్షణకు చాలా ఉపయోగపడతాయని అన్నారు. మండలంలోని కాసిపేట దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని గ్రామాలను సురక్షితంగా మేర రహిత గ్రామాలుగా ఉంచు కోగలరని పిలుపునిచ్చారు.
కాసిపేట పంచాయితీలో..
కాసిపేట గ్రామంలో సిసి కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దేవి, ఎంపీటీసీ అక్క పెళ్లి లక్ష్మి, ఉప సర్పంచ్ సుమన్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు రత్నం ప్రదీప్, కాసిపేట ఎస్సై గంగారాం పాల్గొన్నారు.
పల్లం గూడెం పంచాయతీ లో..
పల్లం గూడెం పంచాయతీలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ దుస్స విజయ -చందు, ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి, దేవాపూర్ ఎస్సై విజయేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



