అర్హులైన ముస్లిం పేద కుటుంబాలకు మైనార్టీ లోన్లు ఇవ్వాలి.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల లో పేద ముస్లిం మైనారిటీ లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కాసిపెట శాఖ మైనార్టీ మోర్చా అధ్యక్షులు యూసఫ్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాసిపేట మండలంలో వందలాది ముస్లిం పేద కుటుంబాలు ఉండగా రెండు యూనిట్లు ఇవ్వడం చాలా బాధాకరం అన్నారు. మండలం ముస్లిం 20 యూనిట్ అంతకన్నా ఎక్కువగా యూనిట్లను పెంచి అర్హులైన ముస్లిం సోదరులకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ అటకపురం రమేష్,బిజెపి మండలప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్, మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్,పోషం, ఓబీసీ మండల అధ్యక్షులు పెద్దపల్లి శంకర్, గిరిజన మోచ నాయకులు నాతం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
