బాబాసాహెబ్ అంబేద్కర్ సలహాలు, సూచనలు పాటించక పోవడం వల్లనే పేదరికంలో భారతదేశం.
నేడే బాబాసాహెబ్ 132వ జయంతి.
Scv News Kasipet:--
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా,ప్రపంచంలోని అత్యధిక సహజ వనరులతో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం నేడు దారిద్రం, ఆకలిలో ప్రపంచ దేశాలలో 101వ స్థానంలో ఉండడానికి గల కారణాలు ఏవ రు? అంబేద్కర్ గారు ఈ దేశ పౌరుల కోసం చేసిన సూచనలు సలహాలు పాలకులు అమలు చేయ పోవడం వల్లనే ఇంకా పేదరికం లో మగ్గుతున్నారు.
* దేశంలోని మనువాద బ్రాహ్మణీయ భావజాలం తో ఉన్న పాలకవర్గాలు బాబా సాహెబ్ అంబేద్కర్ సలహాలు,సూచనలు పాటించక పోవడమే ప్రధాన కారణమని హార్వార్డ్ యూనివర్సిటీ మేధావి వర్గం ఇటీవల తేల్చిచెప్పింది.
*బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలి?. పేదరిక నిర్మూలన ఎలా చేయాలి?. జనాభాలో 85% ఉన్న బహుజన వర్గాలకు అభివృద్ధి పథంలోకి ఎలా తీసుకురావాలో ఈ దేశ నాయకత్వానికి అంబేద్కర్ ఇచ్చిన సలహాలు, సూచనల పై సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం...
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో సారవంత మైన భూములు, నిత్యం ప్రవహించే జీవనదులు, అపారమైన సహజ వనరులు, ఖనిజ సంపదలు ఉన్నా ఎందుకు అభివృద్ధి చెందడం లేదు అన్న ప్రశ్న ప్రపంచ మేధావులను దశాబ్దాలుగా తొలిచి వేస్తుంది. దేశంలో 85% ఉన్న బహుజన వర్గాలకు సరైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభించక విదేశాలకు ఉపాధి కోసం ఎందుకు వలస వెళ్తున్నారు.? గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు పట్టణాలకు వలసలు రావడానికి గల కారణాలు ఏమిటి?ప్రపంచంలో భారతదేశం కంటే వెనక బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం సాధించి అభివృద్ధి పథంలో ఎన్నో దేశాలు దూసుకు పోతున్న భారతదేశం 75 ఏళ్ల క్రితం స్వాతంత్రం సాధించిన ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు ఉంటుంది? దీనికి కారణాలేమిటి? అనే అంశాలపై విదేశాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రపంచం ఐఐటి గా భావించే హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ అంశాలపై రెండు సంవత్సరాల సుదీర్ఘ డిబేట్ జరిగి తేల్చిన విషయం ఏమిటంటే? ప్రపంచ మేధావిగా పేరుగాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి ప్రధాని చేయకపోవడం , మహనీయుడి సలహాలు సూచనలను పట్టించుకోకపోవడం భారతదేశం పేదరికానికి ప్రధాన కారణమని ప్రపంచ మేధావి వర్గం తేల్చారు.
భారత దేశ ప్రజలు దేశ స్వాతంత్రం కోసం పోరాడినా ఫలితం బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం నుండి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అధికారాన్ని మాత్రం 15 శాతం వున్నా మనువాద బ్రాహ్మణ, బనియా వర్గాలకు చెందిన భూస్వాములు,పారిశ్రామికవేత్తలు
చేజిక్కించుకున్నారు. అధికారాన్ని వారి వర్గ స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల దేశంలోని 85 శాతం ఉన్న బహుజన వర్గాలన్నీ అభివృద్ధి చెందక నేటికీ పేదరికంలోనే కొనసాగుతూన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బహుజనులు అభివృద్ధి చెందకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని స్వాతంత్రానికి ముందు, తర్వాత కరుడుగట్టిన మను వాదులతో సుదీర్ఘమైన రాజీలేని పోరాటం నిర్వహించాడు.దేశంలో మెజారిటీ వర్గాలైన బహుజనులను మనుషులుగా కూడా గుర్తించని సమయంలో బ్రిటిష్ వారిని ఒప్పించి రౌండ్ టేబుల్ సమావేశంలో ఓటుహక్కును సంపాదించి పెట్టాడు. కమ్యునల్ అవార్డు ద్వారా బహుజనులకు రాజ్యాధికారం వచ్చే విధంగా బ్రిటిష్ వారి ద్వారా ఒప్పందం కుదుర్చు కున్నాడు. బహుజనులు రాజాధికారంలోకి రాకుండా మనువాద బ్రాహ్మణ వర్గానికి నాయకుడైన గాంధీ కుట్ర చేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల పూనా ఒప్పందం ముతో కమ్యూనల్ అవార్డును కోల్పోయాం.దాని ఫలితంగానే నేటికి బహుజనవర్గం అధికారానికి దూరమై, అభివృద్ధి లేక పేదరికంలో ఉండడానికి ప్రధాన కారణం.
ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ వర్గాలు అధికారంలో ఉండి మైనారిటీ వర్గాలను పాలించడం.ఇది ప్రపంచం లోని అన్ని దేశాల్లో అమలు జరుగు తున్న తీరు. భారతదేశంలో మాత్రం 15 శాతం ఉన్న అగ్రవర్ణాల అయినా బ్రాహ్మణ,బనియా వర్గాలే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లుగా దేశంలో, రాష్ట్రాలలో ప్రధానమంత్రి,ముఖ్యమంత్రి పదవుల లో ఉంటున్నారు. రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ కుట్రలు, కుతంత్రాలతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని దశాబ్దాలుగా పాలించడం వల్ల 85 శాతం బహుజనులకు న్యాయం జరగడం లేదు.
అపారమైన సహజ వనరులు భారత దేశం సొంతం.
ప్రపంచంలోనే అత్యధిక సాగు భూమి, నీటి వసతులు ఉన్నా దేశం భారతదేశం. సహజ వనరులు, ఖనిజ సంపదలలో అమెరికా తర్వాత భారత్ దే అగ్రస్థానం. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో 4వ స్థానం, ఐరన్ ఉత్పత్తిలో ఏడవ స్థానం, మైకా ఖనిజ సంపద లో 5వ స్థానం లో భారత్ ఉంది. ఆహార ఉత్పత్తులు సాధించడం లో కూడా అగ్ర స్థానంలోనే కొనసాగు తోంది. భూమి,సహజ వనరులు,ఖనిజ సంపదలన్ని సరైన రీతిలో ఉపయోగించకుండా కొంత మంది భూస్వాములు, పారిశ్రామిక చేతుల్లో ఉండడంవల్ల బహుజన వర్గ ప్రజలకు న్యాయం జరగడంలేదు. గ్రామాలలో ప్రజలకు వ్యవసాయం చేసేందుకు భూములు లేక బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఎలాంటి సహజ వనరులు లేని చుట్టూ సముద్రం, ఇసుక తిన్నలతో ఉన్న ఎడారి దీవులైన దుబాయ్,ఖాతర్, అరబ్ ఎమిరేట్స్ లాంటి గల్ఫ్ దేశాలకు లక్షలాది మంది నిరుద్యోగ యువత వలసలు వెళ్లి బ్రతకాల్సిన పరిస్థితి దేశంలోనెలకొంది.
మన దేశంతో పాటు స్వాతంత్రం పొందిన దేశాలు ముందుకు, మనం వెనకబడడానికి కారణాలు ఎవరు?
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి స్వాతంత్రం పొందిన దేశాలు ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. మన దేశం మాత్రం ప్రపంచ దేశాల అభివృద్ధి సూచికల్లో వందకు పైగా స్థానాల కింద ఉన్నా ము.మన పోరుగున ఉన్న చైనా మన దేశం కంటే ఎక్కువ జనాభా కలిగి ఉండి ఒకేసారి స్వాతంత్రాన్ని పొంది ఆకలి,దారిద్రంపై విజయం సాధించి అభివృద్ధి పథంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణు బాంబులతో నాగసాకి, హిరోషిమా పట్టణాలపై దాడి చేస్తే జపాన్ దేశం కోలుకోలేని విధంగా తీవ్రంగా దెబ్బతింది. అయినా 20 ఏళ్లలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదిగింది. దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్ లాంటి ఆసియా దేశాలు ఎంతో అభివృద్ధి పథంలో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచ దేశాలలో మన దేశ అభివృద్ధి సూచికలు ఎలా ఉన్నాయో చూద్దాం!.
ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని 195 దేశాల్లోని అభివృద్ధి, ఆకలి, దారిద్రం, ఆనందం, పత్రికా స్వేచ్ఛ తదితర అంశాలలో ఏ ఏ దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో నివేదికను విడుదల చేస్తాయి. 2022లో ప్రపంచ నివేదికలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ఏ స్థాయిలో ఉందో చూడండి...
* గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఆకలి ఉన్న దేశాలలో 101 స్థానం,
* పత్రికా స్వేచ్ఛలో 150 వ స్థానం,
* ఆనందంలో 136 వ స్థానం,
*మానవ స్వేచ్ఛలో 119 వ స్థానం,
* అవినీతిలో 86వ స్థానం, *మానవాభివృద్ధిలో 131 వ స్థానం,
*శాంతి లో 135 వ స్థానం,
* ప్రజాస్వామ్య స్వేచ్ఛలో 91వ స్థానం,
* బాలల హక్కుల స్వేచ్ఛలో 113 వ స్థానం.
ప్రపంచంలో మన దేశ పరిస్థితి ఇది...
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచి అమృత దినోత్సవాలు జరుపుకుంటు న్న మనువాద బ్రాహ్మణ పాలకవర్గాలు దేశం ఎంతో అభివృద్ధి పథంలో పయనిస్తుందని గప్పాలు కొట్టుకుంటు ప్రచారం చేసుకోవడం అవమానకరం .
విశ్వ గురువు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్య్రానికి ముందు దేశం అభివృద్ధి పథంలో నడిచేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వీటిని మనువాద బ్రాహ్మణ అగ్రవర్ణాలు పట్టించుకోకుండా అవమా నించాయి. ఫలితంగా దేశం అగర్బ దారిద్యంలో కూరుకుపోయింది.
అంబేద్కర్ సూచించిన సలహాలు ఇవి...*
బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వాతంత్రం వచ్చేముందు దేశంలోని బహుజన వర్గాలను పేదరికం నుండి బయట పడవేసి భారతదేశం అభివృద్ధి పథంలో నడిపించేందుకు 1946 డిసెంబర్ 9 న రాజ్యాంగ సభకు నాలుగు సూచనలు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భూమి, పరిశ్రమలు, సహజ సంపదలన్నీ మన ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి కాబట్టి
మూడు అంశాలను అమలు చేయాలని కోరారు.
1. దేశంలోని భూమి అంతా ప్రజలకు పంచాలి.
2. పరిశ్రమలన్నీ జాతీయంచేసుకొని ప్రభుత్వ ఆధీనంలో నడిపించాలి.
3. సహజ సంపదలను జాతీయం చేసుకోవాలి.
బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన ఈ మూడు అంశాలను భూస్వాముల పారిశ్రామికవేత్తల తొత్తులుగా మారిన గాంధీ,నెహ్రూ, పటేల్ ఒప్పుకోలేదు. మూడు అంశాలను రాజ్యాంగంలో చేర్చేందుకు నిరాకరించారు. దాని ఫలితంగానే ఈ రోజు భారతదేశం పేదరికంలో ఉండడానికి ప్రధాన కారణం.అంబేద్కర్ సూచించిన విధంగా భూస్వాములు జాగీర్దార్ల వద్ద ఉన్న వేలాది ఎకరాల భూమిని గ్రామీణ ప్రాంతంలోని పేదలందరికీ పంచితే భూమి సాగులోకి వచ్చి ఆహార ఉత్పత్తులు పెరిగి దేశం ఎంతో అభివృద్ధి పథంలోకి వచ్చేది. ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు పట్టణాలకు వలసలు వెళ్లేవారు కాదు. పరిశ్రమలను జాతీయం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలో నడిస్తే అందరికీ ఉపాధి దొరికేది.దేశంలోని సహజ సంపద, ఖనిజ సంపదతో కర్మాగారలు ఏర్పాటు చేసి ఉత్పత్తులు తీస్తే ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారతదేశం నిలిచేది. మనువాద బ్రాహ్మణ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం భూస్వాములకు, జాగీర్దార్ల కు,టాటా బిర్లా లాంటి పారిశ్రామిక వేత్తల చేతుల్లో ఉండడం వల్ల భూమిని పరిశ్రమలను జాతీయం చేయలేక పోయింది. దీనివల్ల దేశం అభివృద్ధి చెందక పోవడంతో పాటు బహుజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. పొరుగున ఉన్న చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మావో భూములను పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచింది.
ప్రపంచ మేధావి అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ మొదటి నుండి తీవ్ర నిర్లక్ష్యం.
బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల మనువాద బ్రాహ్మణ భావజాలంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా ప్రతిభను గుర్తించకుండా కక్షపూరితంగా వ్యవహరించింది. అంబేద్కర్ స్వాతంత్రానికి ముందు, తర్వాత దేశంలోని అణ గారిన వర్గాలైన బహుజనులకు హక్కులు సాధించడంలో, దేశ పురోభివృద్ధికి, పరిపాలన ఎలా చేయాలి అని రాజ్యాంగాన్ని రాసి పెట్టాడు. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయం. రిజర్వు బ్యాంక్ ఏర్పాటు, నదీ జలాల పంపిణీ వాటిపై ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, కార్మికులకు మహిళలకు ఎన్నో హక్కులు సాధించిపెట్టిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ ది. దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించకుండా అడుగడుగునా అవమానించింది.
బాబా సాహెబ్ అమరుడైన 34 ఏళ్ల కు భారతరత్న అవార్డు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన ప్రజల కోసం పోరాడడం మనువాద బ్రాహ్మణ కాంగ్రెస్ నాయకులకు అసలు నచ్చలేదు. రాజ్యాంగాన్ని రాయకుండా, రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా ఎన్నో కుట్రలు చేసి ఓడించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా అంబేద్కర్ ఎన్నో రకాల వేధింపులకు అవమానాలకు గురి చేశారు. భారతదేశ చరిత్రలో బహుజనుల కోసం పోరాడిన మహాయోధులైన బుద్ధుడు, అశోకుడు, చత్రపతి శివాజీ ల చరిత్రలను ఎలా కనుమరుగు చేశారో అంబేద్కర్ చరిత్రను కూడా కనుమరుగు చేసే ప్రయత్నాలు జరిగాయి. బహుజన వర్గాలకు అంబేద్కర్ చరిత్రను తెలవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసి అతని ప్రాముఖ్యత ను తగ్గించే కుట్రలకు తెరతీశారు. దేశ స్వాతంత్రం అనంతరం గాంధీ,నెహ్రూ, ఇతర జాతీయ నాయకులకు భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించాయి. దేశానికి ఎలాంటి సేవ చేయలేని వారికి, సినీ నటులకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న అవార్డ్ ఇచ్చి గౌరవించాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన ప్రజలకోసం, దేశం కోసం జీవితాన్ని, కుటుంబా న్ని త్యాగం చేసిన కూడా బ్రతి కున్నంత వరకు భారతరత్న అవార్డు ఇవ్వకుండా అవమానిం చాయి.
అంబేద్కర్ చనిపోయిన 34 సంవత్సరాలకి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వి.పి.సింగ్ ప్రభుత్వం గుర్తించి 1990లో బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాయి. అప్పటి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం గురించి బహుజనులకు తెలిసింది.
అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన విద్య,ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల వల్ల బహుజనులకు పదవులు లభించడంతో అంబేద్కర్ మా నాయకుడు అనే స్పృహ ఇప్పుడిప్పుడే బహుజన వర్గాలు లోకి వస్తుంది.
రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులను కల్పించాడు.
బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం సాధించిన తర్వాత స్వతంత్ర భారతంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛ, సమానత్వం, సోదరా బావ విలువలతో బతకడానికి రాజ్యాంగ రూపంలో అంబేద్కర్ ఎన్నో హక్కులను సాధించి పెట్టాడు. బహుజన వర్గాలు ఆ హక్కులతో స్వేచ్ఛగా బ్రతకాలి అన్న బ్రతకనీయకుండా అణచి వేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న మనువాద బ్రాహ్మణ వర్గం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని మార్చి మళ్లీ మనువాద రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోని సంపదను బ్రాహ్మణ బనియా వర్గాలకు చెందిన ఒక శాతం మంది 40% సంపాదనను తమ చేతిలో పెట్టుకున్నారు.
అంబేద్కర్ సూచనలతో నెహ్రూ ప్రభుత్వ హాయంలో వెలిసిన ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రస్తుత పాలకులు అమ్మేస్తున్నారు. బహుజన వర్గాలకు రిజర్వేషన్లు అందకుండా పరిశ్రమలను యూనివర్సిటీలను కూడా ప్రైవేటుపరం చేస్తూ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.
బహుజన రాజ్యస్థాపన తోనే దేశంలోని మెజారిటీ వర్గాలైన బహుజనులకు న్యాయం.
భారత దేశంలోని 85 శాతం ఉన్న బహుజనుల అందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి లభించి అభివృద్ధి పథంలో రావాలంటే బహుజనుల రాజ్యాధికారమే ఏకైక పరిష్కార మార్గం. అంబేద్కర్, పూలే, కాన్షీరామ్ ఆలోచనలతో మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారానికి రావడం కోసం బహుజన ప్రజలంతా చైతన్యవంతంగా కావాలి. బహుజన వర్గాల మేధావి వర్గం చిన్న చిన్న అభిప్రాయ బేధాలతో విడిపోకుండా ఐక్యమై బహుజన వర్గాలను మేల్కొల్పి చైతన్యవంతం చేయాల్సిన అవశ్యకత ఉందని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా భావిస్తూ ఆ దిశగా బహుజన మేధావులు కృషి చేయాలని కోరుతున్నాం .
