సిలిండర్ ధర పెంచినందుకు నిరసన గా బిఆర్ఎస్ పార్టీ ఆందోళన.

కాసిపేట చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు
Scv News Kasipet:--
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు నిరసనగా కాసిపేట మండల బి.అర్.ఎస్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తంచేసి కాసిపేట ప్రధాన రహదారి పై రాస్తా రోకో చేశారు. రాస్తారోకో వల్ల ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచి వాహనాదారు లు ఇబ్బందులకు గురయ్యారు. కాసిపేట ఎస్సై గంగారం టిఆర్ఎస్ నాయకులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, జెడ్పిటిసి పల్లె చంద్రయ్య,మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు,మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తయ్య, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి , ఎంపీటీసీలు అక్క పెళ్లి లక్ష్మి, రాంచందర్ నవనందుల చంద్రమౌళి, సర్పంచులు ఆడే జంగు మండల పార్టీ నాయకులు లంక లక్ష్మణ్, వడ్లూరి మల్లేష్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.
