మల్కపెల్లి ఆశ్రమ
పాఠశాలలో తుడుం దెబ్బ
ఆధ్వర్యంలో పదవ తరగతి
విద్యార్థులకు అవగాహన.
![]() |
| ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న తుడుం దెబ్బ నాయకులు. |
Scv News kasipeta:--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లోని మల్కపల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ రోజు కాసిపేట మండల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కమిటీ అధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన నిర్వహించడం జరిగింది. హోలీ పండుగకు విద్యార్థులు ఇంటికి వెల్ల కుండ సమయాన్ని వృద చేయ కుండా ప్రతి సబ్జెక్ట్ చదువు కోవాలన్నారు. విద్యార్థులు ఉదయం లేచి ప్రతి ఒక్క ప్రశ్న వదలకుండా ఉపాధ్యాయులను అడుగుతూ ఒకరికి ఒకరు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెంద్రం శంకర్. ఆత్రం సంజీవ్ తుడుందెబ్బ మండల ఉపాధ్యక్షులు పెంద్రం ప్రభాకర్ మండల కోశాధికారి. ఆశ్రమ పాఠశాల HM అజ్మీరా నరసింహ. ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
