కాసిపేట మండలంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు.
![]() |
| ధర్మ రావు పేట కోదండ రామాలయంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం |
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధర్మారావుపేట కోదండ రామాలయంలో ఆలయ నిర్మాణ కర్త రఘుపతిరావు, అతని కుమారుడు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రఘుపతిరావు చిన్న కుమారుడి దంపతులు కూర్చున్నారు. సల్పలవాగులోని కోదండ రామాలయంలో దేవాపూర్ మాజీ సర్పంచ్ కడప ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలో కోమటి చేను గ్రామాలలో కూడా సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు ఆంజనేయ భక్తులకు ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సల్పలవాగు సీతారామ కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులందరికీ కల్కి భగవాన్ భక్తులు భగీరథ రెడ్డి ఆధ్వర్యంలో చల్లటి మినరల్ వాటర్ ను అందించారు.

