సోమగూడెం న్యూ కాలనీ లో పోచమ్మ బోనాలు.

సోమ గూడెం న్యూ కాలనీలో పోచమ్మ బోనాల లో పాల్గొన్న సర్పంచ్ వేముల కృష్ణ.
Scv News Kasipet:--
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ లో ఈరోజు 4 వ వార్షికోత్సవం సందర్భంగా పోచమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు పోచమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా బోనాలతో, డప్పు వాయిద్యాలు శివసత్తుల నృత్యాలు వెనక వెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణ , నాయకులు నారిశెట్టి వెంకన్న, వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి,బన్న హిందుమతి, బొల్లపొల్లి కొమురక్క, నాయకులు గాదం గట్టయ్య, శ్రీనివాస్, శ్రీధర్, గ్రామ యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు