మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

నేషనల్ స్కాలర్షిప్ కు కాసిపేట మండల విద్యార్థుల ఎంపిక.

 నేషనల్ స్కాలర్ షిప్ కు కాసిపేట మండల విద్యార్థుల ఎంపిక 



Scv News Kasipet:--

 జాతీయస్థాయిలో జరిగిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కు కాసిపేట మండలంలోని ఆదర్శ పాఠశాల,  ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి ఇద్దరు 8 వ తరగతి  విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 12000 చొప్పున ఇంటర్మీడియట్ వరకు స్కాలర్షిప్ అందుతుంది

ఆదర్శ పాఠశాల నుండి దాసరి సాయి చరణ్ ఎంపికయ్యాడు. ఎంపికైన విద్యార్థి  కి పాఠశాల ప్రిన్సిపల్ అందినాగ మల్లయ్య, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కూకట్ల రాజేష్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన  8వ తరగతి విద్యార్థిని బిందు ప్రియ  ఎంపికయ్యా రు.ఈ సందర్బంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యార్థినినిపాఠశాల హెచ్ఎం రాథోడ్ రమేష్ అభినందిం చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు పుష్పలత, జ్యోతి, పుష్పలత, అర్చన పాల్గొన్నారు.